Priyanka Chopra.. అన్ని కథలూ కంచికి చేరవు. అన్ని వైవాహిక బంధాలూ.. కలకాలం కొనసాగాలన్న రూల్ ఏమీ లేదు. సమంత – నాగచైతన్యల ప్రేమకథ, వైవాహిక బంధం ఏమయ్యాయో చూశాం. ఇక, ఇప్పుడు ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ ప్రేమ కథ, వైవాహిక బంధం కూడా మధ్యలోనే ముగిసిపోయేలా వున్నాయ్.!
సేమ్ టు సేమ్.. సమంత ఎలాగైతే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ‘అక్కినేని’ అనే పేరుని తొలుత తొలగించి, రకరకాల ఊహాగానాలకు తావిచ్చిందో.. అలానే బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కూడా ‘జోనాస్’ పేరుని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించి.. ఎవరెలా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండన్నట్టుగా ఓ పజిల్ వదిలింది.
Priyanka Chopra కూడా అంతేనా.?
ఇంకేముంది, ప్రియాంకా చోప్రా తన భర్త నిక్ జోనాస్ (Priyanka Chopra Jonas) నుంచి విడిపోబోతోందంటూ ఊహాగానాలు షురూ అయ్యాయి. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంతలోనే ఏమయ్యిందట.? ఏమో, ఆ ఇద్దరికే తెలియాలి. ప్రియాంక చోప్రా తల్లి మాత్రం.. జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని అంటోంది.

అన్నట్టు, ప్రియాంక చోప్రా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్‌ని చాన్నాళ్ళపాటు ప్రేమించి, కొన్నాళ్ళ క్రితమే పెళ్ళి చేసుకున్న విషయం విదితమే. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి షిఫ్టయిపోయిన ప్రియాంకా చోప్రా అక్కడే అవకాశాల్ని వెతుక్కుంటోంది.
Also Read: సమంత, నాగచైతన్య మధ్యలో అతనెవ్వడు.?
తన ఫేమ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాక.. అంతర్జాతీయ వేదికలపై తనదైన స్టయిల్లో ‘షో’ షురూ చేశాక, నిక్ జోనాస్‌తో కలిసి సందడి మరింత ఎక్కువ చేసింది ప్రియాంక. ఇంతకీ నిక్ జోనాస్ – ప్రియాంక చోప్రాల (Priyanka Chopra) మధ్య వైవాహిక బంధం కొనసాగుతుందా.? అర్థాంతరంగా ముగిసిపోతోందా.?