Table of Contents
Cryptocurrency.. క్రిప్టో కరెన్సీ.. ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం. క్రిప్టో కరెన్సీలో కరెన్సీ వుంటుంది.. కానీ, అది భౌతికంగా కాదు. సరిగ్గా ప్లాన్ చేస్తే, క్రిప్టో కరెన్సీతో కోట్లు గడించొచ్చు. తేడా వస్తే అంతే సంగతులు. క్రిప్టో కరెన్సీకి భౌతిక రూపం లేనే లేదు.
బిట్ కాయిన్ అనీ, ఇంకోటనీ.. రకరకాల రూపాల్లో ఈ క్రిప్టో కరెన్సీ అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు తిరుగుతుంటుంది. అయితే, ఈ క్రిప్టో కరెన్సీ మీద చాలా దేశాల్లో నియంత్రణ లేదు. అసలు ప్రపంచంలో ఎక్కడా దీనిపై ఆంక్షలు గట్టిగా లేవనే చెప్పాలి.
Cryptocurrency.. లాభాలూ, నష్టాలూ.!
దాంతో, ఎవరికి తోచిన రీతిలో వారు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జిస్తున్నారు.. నష్టాల్లో కూరుకుపోతున్నారు కూడా. రాత్రికి రాత్రే క్రిప్టో కరెన్సీ కారణంగా అపర కుబేరులైనవారూ వున్నారు. అదే సమంలో, రాత్రికి రాత్రి కుబేరులు కాస్తా, బిచ్చగాళ్ళలా మారిపోయిన సందర్భాలూ వున్నాయి.
మన దేశంలో ఇప్పుడిప్పుడే క్రిప్టో కరెన్సీ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. క్రిప్టో కరెన్సీ మీద నియంత్రణ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులేస్తోంది. ఆర్థిక వ్యవస్థల్ని ఇప్పుడీ క్రిప్టో కరెన్సీ సవాల్ చేస్తుండడమే అందుక్కారణం.
నిండా ముంచేస్తున్న Cryptocurrency యాప్స్..
చాలా యాప్స్ ద్వారా క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వుంది. వాటిల్లో నూటికి తొంభై ఐదుకి పైగా యాప్స్ నష్టం కలిగించేవే. మరి, ఈ క్రిప్టో కరెన్సీని నియంత్రించేదెలా.? నిజానికి, దీన్ని నియంత్రించడం అంత తేలిక కాదు.

ఎక్కువగా డార్క్ వెబ్ ద్వారానే ఈ క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) లావాదేవీలు జరుగుతుంటాయి. సో, వాటి రహస్యాల్ని ఛేదించడం చాలా చాలా కష్టం. అలాగని, అది అసాధ్యమనీ చెప్పలేం. క్రిప్టో కరెన్సీకి సంబంధించి బిట్ కాయిన్ టాప్ ప్లేస్‌లో వుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. దీని విలువ ప్రస్తుతం లక్షల్లో వుంది.
ఆట కాదు, వేట..
క్రిప్టో కరెన్సీ ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్‌లో ఉపయోగపడుతోంది. అలా ఆ ఆటల ద్వారానే డబ్బు జనరేట్ అవుతోంది కూడా. ఆటల్లో డబ్బు పుడుతోంది, ఆటల కారణంగానే క్రిప్టో కరెన్సీ చాలామంది ప్రాణాల్ని కూడా బలిగొంటోంది. వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్ల లావాదేవీలిప్పుడు క్రిప్టో కరెన్సీలోనే వున్నాయంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు.
ఓ కాయిన్ ధర 50 లక్షలని అనుకుందాం. అలాంటివి ఓ వెయ్యి కాయిన్లు క్రిప్టో కరెన్సీ రూపంలో ఓ వ్యక్తి దగ్గర వున్నాయనుకుందాం. దాన్ని ఏ ప్రభుత్వమైనా ఎలా లెక్కగట్టగలదు.? దీనికి ఓ ఖచ్చితమైన అంతర్జాతీయ విధానం వుండి వుండాల్సిందే తప్ప.. ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకంగా చర్యలు చేపడితే లాభం లేదు.
Also Read: అమ్మో ఒకటో తారీఖు.. అయిపోద్ది బతుకు బస్టాండు
జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, తక్కువ సమయంలోనే సంపదను వృద్ధి చేసుకోవడానికి క్రిప్టో కరెన్సీ ఓ మంచి మార్గం. కానీ, అందులో మంచి కన్నా చెడు ఎక్కువ వుంటుందన్నది ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నమాట. మరి, కేంద్ర ప్రభుత్వం ఈ క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) విషయంలో ఎలాంటి ముందడుగు వేస్తుందో వేచి చూడాలి.