Home » Flying Car కథా కమామిషు.. గాల్లో తేలినట్టుందే.!

Flying Car కథా కమామిషు.. గాల్లో తేలినట్టుందే.!

by hellomudra
0 comments
Flying Car

Flying Car.. ఓ మై గాడ్.. ట్రాఫిక్ జామ్.. బంపర్ టు బంపర్ డ్రైవింగ్.. ఎంచక్కా ఉన్న పళంగానే కారుకో, బైకుకో రెక్కలొచ్చి అమాంతం అలా గాల్లోకి తేలిపోతే ఎంత బావుంటుందో కదా. సిట్యువేషనల్‌గా ‘గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే..’అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఎంజాయ్ చేసేయొచ్చు. కానీ, అలా జరుగుతుందా.?

అబ్బే అవన్నీ జేమ్స్ బాండ్ సినిమాల్లోనూ, అవెంజర్స్ సినిమాల్లోనూ జరిగే మ్యాజిక్స్ అంటారా.? ఊహూ.. కాస్త అప్‌డేట్ వెర్షన్.. అదేనండీ @2.0 వెర్షన్‌లో థింక్ చేస్తే.. మన టెక్నాలజీ ఆ రేంజ్‌ని అందుకుంటుందేమో భవిష్యత్తులో. అప్పుడు ఎంచక్కా అలాగే ట్రాఫిక్‌లోంచి అమాంతం గాల్లో ఎగిరిపోవచ్చన్న మాట.

గాల్లో తేలినట్టుందే..

ఆల్రెడీ గాల్లో ఎగిరే కార్లు ఇప్పటికే ఉన్నాయ్. ‘వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనాలు’ అంటారు వీటిని. కానీ, అవి అంతగా వాడకంలో లేవు. అలాగే, నీటిలోనూ, నేల మీదా, గాల్లోనూ నడిచే విమానాలూ ఉన్నాయ్. అత్యవసర అవసరాల కోసం మాత్రమే వాటిని వాడుతున్నారనుకోండి. అది వేరే సంగతి. ఇప్పుడు సరదాగా మనం, ఓ కొత్త రకం విమానం గురించి మాట్లాడుకుందాం.

Flying Car
Flying Car

అచ్చు పక్షిలా ఉండే విమానమన్నమాట అది. పక్షిని స్ఫూర్తిగా తీసుకునే మన వాళ్లు విమానం తయారు చేశారు కదా.. అంటారా. అయితే, ఏ విమానం ల్యాండింగ్ కోసమైనా హెలీప్యాడ్ కానీ, రన్ వే కానీ ఉండాలి కదా.. కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విమానానికి అలాంటివేం అవసరం లేదు.

టేకాఫ్.. ల్యాండింగ్.. కారులో షికారు..

ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా కాళ్ల మీదే నిటారుగా ల్యాండ్ అయిపోతుందీ విమానం. అవునండీ, అచ్చు పక్షి కాళ్లను పోలినట్లే దీని అమరిక ఉంది మరి. చెట్టు మీద వాలినప్పుడు పక్షి ఎలాగైతే కాళ్లతో కొమ్మను అదిమి పట్టుకుంటుందో అలాగే, ఈ విమానం కూడా కాళ్లతో పెద్ద పెద్ద చెట్టు కొమ్మలను అదిమి పట్టుకుంటుందట. భలే ఉంది కదా..

ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే ఓ విమాన సంస్థ ఈ కొత్త వెర్షన్ విమానాన్ని రూపొందించింది. పూర్తిగా విద్యుత్‌తో మాత్రమే నడిచే ఈ విమానాన్ని పైలట్ మోడ్‌తో పాటు, రిమోట్ కంట్రోల్ ద్వారానూ నడపొచ్చట. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దాదాపు 150 కిలోల బరువున్న వస్తువుల్ని ఈ విమానాలు సునాయాసంగా తీసుకెళ్లగలవట.

Also Read: దేవిశ్రీ ప్రసాదం.! ఐటమ్ సాంగ్ అనబడు భక్తి గీతం.!

భలే భలే.. ఈ కొత్త రకం పక్షి విమానాన్నితయారు చేసిన ఈ సంస్థ త్వరలోనే రెక్కల కార్లనూ, రెక్కల బైకులనూ కూడా తయారు చేసేస్తే ఎంత బావుంటుందో కదా..

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group