RRR Trailer Review తెరపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీయార్.. తెరవెనుకాల జక్కన్న రాజమౌళి.. అంతేనా, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరన్, సముద్ర ఖని వంటి టాప్ క్లాస్ నటీనటులు.. కీరవాణి తదితర అత్యద్భుమైన ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు.. వీళ్ళంతా కలిస్తే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎలా వుంటుంది.?
ఫస్ట్ ప్రోమో నుంచి ఇప్పటివరకు.. అంటే, ట్రైలర్ విడుదలయ్యేవరకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఎక్కడా సినీ అభిమానుల్ని నిరాశపర్చలేదు. ప్రతిసారీ, అంతకు మించి.. అనే స్థాయిలోనే ప్రోమోస్ వస్తున్నాయి. ఒకదాన్ని మించి ఇంకోటి, సగటు సినీ ప్రేక్షకుడ్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
RRR Trailer Review.. అంతకు మించి..
తాజాగా ట్రైలర్ విడుదలయ్యింది. రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఎన్టీయార్ (Young Tiger NTR).. ఈ ఇద్దరికీ వున్న అభిమానుల ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ అభిమానుల్ని సంతృప్తి పరచాలి, సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలి.. ఇదేమీ చిన్న విషయం కాదు.
రెండు పవర్ హౌస్‌లు తెరపై కన్పించాయి. తెరవెనుకాల పవర్ హౌస్ గురించి అందరికీ తెలిసిందే. మూడు నిమిషాల ట్రైలర్‌లో.. ప్రతి క్షణం.. మైండ్ బ్లోయింగ్ అనిపించిందంటే, దటీజ్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie). మళ్ళీ ఇలాంటి ట్రైలర్ ఇంకోటి సమీప భవిష్యత్తులో వస్తుందా.? రాదా.? వస్తే, మళ్ళీ అది రాజమౌళి నుంచే.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
యుద్ధాన్ని వెతుక్కుంటూ వచ్చేశారు..
ఆ విజువల్స్.. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. తెరపై రామ్‌చరణ్, ఎన్టీయార్ తమ తమ పాత్రల్లో చేస్తున్న సింహగర్జన.. కావాల్సినన్ని ఎమోషన్స్.. వాట్ నాట్.. అన్నీ వున్నాయ్. బ్రిటిష్ అధికారి తన చేతిలోకి గన్ అందుకునే సన్నివేశాన్ని రాజమౌళి కాక ఇంకెవరైనా అలా చిత్రీకరించగలరా.?

యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయ్.. అని అజయ్ దేవగన్ (Ajay Devgn) చెప్పిన డైలాగ్.. ఈ సినిమాకీ వర్తిస్తాయి. ‘ఆర్ఆర్ఆర్’ (RRR Trailer Review) సినిమాని వెతుక్కుంటూ అన్ని ఆయుధాలూ.. అదేనండీ నటీనటులు, సాంకేతిక నిపుణులూ వచ్చినట్టున్నారు.
Also Read: చరణ్, ఎన్టీయార్.. వీరనాటు డైనమైట్లు.!
ట్రైలర్ విడుదలకే (RRR Movie) సినిమా రిలీజ్ అయినంత హంగామా నడిచిందంటే, సినిమా విడుదలకి (RRR Trailer) ఇంకే స్థాయిలో హంగామా వుంటుందో. గెట్ రెడీ.. Brace Yourself..