Covid 19 Omicron.. మూడో డోస్ వ్యాక్సిన్ ఎప్పుడు.? బూస్టర్ డోసు తీసుకుంటే ఎక్కువ ప్రొటెక్షన్ లభిస్తుంది గనుక.. దాంతోనే, ఒమిక్రాన్ వేరియంట్‌కి కూడా చెక్ పెట్టవచ్చు.! ఇలా ఓ వైపు ప్రశ్నలు, ఇంకో వైపు అంచనాలు.! కోవిడ్ 19 విషయమై ప్రపంచ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతూనే వున్నాయి.. పరిశోధనలకైతే కొదవే లేదు.
రోజులు గడుస్తున్నాయ్.. నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయ్. అసలు ఏంటీ కరోనా వైరస్.? ఎందుకింతలా మానవుడి మీద పగబట్టేసింది.? ఫేస్ మాస్క్ ధరించి ఎన్నాళ్ళు ఈ జీవితం.? సాధారణ జీవితం గడిపే పరిస్థితి ముందు ముందు వుందా.? లేదా.? ఏదీ అర్థం కాని పరిస్థితి.
Covid 19 Omicron.. డెల్టా, ఒమిక్రాన్.. ఆ తర్వాతేంటో.!
డెల్టా అన్నారు.. ఒమిక్రాన్ (Covid 19) అంటున్నారు.. తర్వాతేంటి.? ఏమో, ఎవరికీ తెలియదు. ఫేస్ మాస్క్ ధరించాల్సిందే.. వ్యాక్సినేషన్ తప్పనిసరి. భౌతిక ధూరం పాటించాలి. చేతుల్ని తరచూ శానిటైజ్ చేసుకోవాలి. ఇవన్నీ పాటిస్తేనే, కరోనా వైరస్ నుంచి కాస్త బతికి బట్టగట్టగలం.
అయినాగానీ, వ్యాక్సిన్ల డోసుల విషయంలో అదే గందరగోళం. ఒకటి కాదు, రెండు డోసులతో పూర్తి ప్రొటెక్షన్ అన్నారు. ఆ తర్వాత బూస్టర్ డోస్ అంటున్నారు. బూస్టర్ డోస్ తర్వాత ఏంటి.? ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ రాదని చెప్పగలమా.? మళ్ళీ ప్రశ్నలే.. ప్రశ్నల మీద ప్రశ్నలు.. కానీ, సమాధానాలే కనిపించడంలేదు.
ఎన్నాళ్ళిలా.? ఎన్నేళ్ళిలా.?
పోనీ, వేసుకున్న వ్యాక్సిన్ (Covid 19 Vaccine) సుదీర్ఘ కాలం పని చేస్తుందా.? అంటే, అదీ లేదు. మూడు నెలలకే ఓ వ్యాక్సిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుందని పలు సర్వేలు, వాటి నివేదికలు చెబుతున్నాయి. మూడు నెలలకా.? ఆరు నెలలకా.? ఏడాదికా.? తప్పనిసరిగా మరో డోస్ వేసుకోకపోతే, మనిషి భయం లేకుండా జీవించడం కష్టమే.

వ్యాక్సిన్ వేసుకుంటే కోవిడ్ 19 (Covid 19 Virus) సోకదన్న గ్యారంటీ లేదు మళ్ళీ. వ్యాక్సిన్ వేసుకున్నవారికి తీవ్రమైన అనారోగ్యం నుంచి రక్షణ లభిస్తుందన్నది వైద్య నిపుణులు చెబుతున్నమాట.
Also Read: మనిషిలా మారుతున్న ‘వానరం’: ఇకనైనా సిగ్గుపడదాం.!
మనకి వేరే ఆప్షన్ లేదు. వ్యాక్సిన్ (Corona Virus Vaccine) వేసుకోవాల్సిందే. దాంతోపాటుగా ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్.. ఇవన్నీ తప్పదుగాక తప్పదు. ఎన్నాళ్ళు.? అనడక్కూడదు. ఆ ప్రశ్నకి సమాధానం లేదు (Covid 19 Omicron) గనుక.