Tollywood Special Item Songs.. సాంగ్‌కీ, స్పెషల్ సాంగ్‌కీ తేడా ఏంటీ.? స్పెషల్ సాంగ్‌కీ, ఐటెం సాంగ్‌కీ తేడా ఏంటీ.? సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో అయితే, ప్రతీ పాట కోసం ప్రత్యేకంగానే కష్టపడాల్సి వస్తుంది. రాత, తీత.. రెండూ ప్రతి పాటకీ కొత్తగానే ఉండాలి. పాటలందు ఐటెం సాంగ్స్ వేరయా.. అన్నట్లు ఐటెం సాంగ్స్‌లోనూ కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉంటాయ్.
ప్రముఖ హీరోయిన్ ఐటెం బాంబ్‌గా మారితే, అది స్పెషల్ సాంగ్. కేవలం ఐటెం సాంగ్స్‌కే పరిమితమైన భామలు నర్తిస్తే అది ఐటెం సాంగ్. తెలుగు తెరపై ఈ స్పెషల్ సాంగ్స్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2021 సంవత్సరంలో పలు విజయవంతమైన చిత్రాలు, కొన్ని ఫ్లాప్ సినిమాలూ వచ్చాయ్.
Also Read: జాతిపుష్పం: ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.!
సినిమా హిట్టయినా, పెద్దగా పాపులర్ అవ్వని స్పెషల్ సాంగ్స్ ఉన్నాయ్. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, స్పెషల్, ఐటెమ్ సాంగ్స్ ఉన్నాయ్. స్టార్ హీరోయిన్ సమంత నుంచి, ఐటెమ్ బాంబ్ అప్పరా రాణి వరకూ ఈ స్పెషల్ లేదా ఐటెమ్ సాంగ్స్‌లో నర్తించారు.
Tollywood Special Item Songs ఆ ‘స్పెషల్’ ఇచ్చే కిక్కే వేరప్పా.!

ఆయా పాటలకీ, తద్వారా ఆయా సినిమాలకీ స్పెషల్ కిక్ ఇచ్చారు. అన్నింట్లోకీ టాప్ వన్ అనిపించుకున్నది మాత్రం ‘పుష్ప’ (Pushpa The Rise) సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా మామా..’ సాంగ్.
నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక సమంత (Samantha Ruth Prabhu) చేసిన స్పెషల్ సాంగ్ కావడం, నట జీవితంలో ఆమెకి ఇదే తొలి స్పెషల్ సాంగ్ కావడం వెరసి ఈ పాటకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.
మగాళ్ల వంకర బుద్ధిని ఈ పాట ప్రశ్నించడంతో పురుష పుంగవులు ఒళ్లు మండి తమ వైపు నుంచి కొన్ని పేరడీ సాంగ్స్ తీసుకొచ్చారు. అలా సమంత పాటకి క్రేజ్ పదింతలయ్యింది.
ఇదిలా ఉంటే, కుమారి 21 ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ (Hebah Patel) కూడా ఈ ఏడాది స్పెషల్ సాంగ్ చేసింది. గత ఏడాది అంటే, 2020లో ‘భీష్మ’ సినిమాలో వ్యాంప్ తరహా పాత్రలో కనిపించిన హెబ్బా ఈ సారి ‘రెడ్’ సినిమా కోసం ఐటెమ్ బాంబ్లా మారింది.
అయితే, సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో హెబ్బా కష్టం వృధా అయ్యింది. సినిమా హిట్టయ్యి ఉండుంటే హెబ్బా అబ్బా అనిపించే స్థాయిలో ఐటెమ్ బాంబ్‌గా పేరు తెచ్చుకునేదే.
అనసూయ వెరీ వెరీ స్పెషల్.!
బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), వెండితెరపై స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు.
‘అబ్బే, అది ఐటమ్ సాంగ్ కాదు.. దాన్ని స్పెషల్ సాంగ్ అనాలి..’ అని పలు మార్లు గుస్సా అయిన అనసూయ, ఈ ఏడాదిలో ‘చావు కబురు చల్లగా’ సినిమా కోసం ‘పైన పటారం..’ అంటూ ఐటమ్ సాంగ్ చేసేసింది. ఈ సాంగ్ బాగానే వర్కవుట్ అయ్యిందిగానీ, పాటతో చెప్పాలనుకున్న నీతి మాత్రం ఐటమ్ బాంబ్ ప్రేమికులకి అస్సలు కిక్కు ఇవ్వలేదు.
సినీ రంగంలో హీరోయిన్గా నిలదొక్కుకుందామనుకున్న మరో బ్యూటీ అంకేతా మహారాణా (Anketa Maharana) పేరు మార్చుకుని ఇప్పుడు ఐటెమ్ బాంబ్ అయ్యింది.
అప్సరా రాణి (Apsara Rani) పేరుతో ఈ ఏడాది రెండు స్పెషల్ సాంగ్స్ చేసింది. ‘భూమ్ బద్దల్.. పెప్సీ ఆంటీ..’ ఈ రెండు స్పెషల్ సాంగ్స్ ఆమె రేంజును పెంచేశాయ్. హీరోయిన్గా దొరకని సక్సెస్ ఐటెమ్ బాంబ్‌గా మారితే దొరికిందామెకి.
ఇంకా బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ (Monal Gajjar) కూడా ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అంతకు ముందు హీరోయిన్గా పలు సినిమాలు చేసినా, కొన్ని సక్సెస్‌లు అందుకున్నా అనూహ్యంగా తెరమరుగైపోయిన మోనాల్ బిగ్‌బాస్ పుణ్యమా అని మళ్లీ వార్తల్లోకెక్కింది. ఆ బిగ్‌బాస్ వల్లనే ఈ స్పెషల్ సాంగ్ ఛాన్సొచ్చింది.
Also Read: దేవిశ్రీ ప్రసాదం.! ఐటమ్ సాంగ్ అనబడు భక్తి గీతం.!
కోవిడ్ ప్యాండమిక్ దెబ్బ కొట్టడం వల్ల సినిమా రంగంలో జోరు తగ్గి స్పెషల్ సాంగ్స్ (Tollywood Special Item Songs) హవా కూడా తగ్గింది కానీ, లేదంటే డజనుకు పైగా చెప్పుకోదగ్గ స్పెషల్ సాంగ్స్ 2021లో వచ్చి ఉండేవే.