Home » Amala Paul గోల్డెన్ ఛాన్స్ కథేంటంటే!

Amala Paul గోల్డెన్ ఛాన్స్ కథేంటంటే!

by hellomudra
0 comments
Amala Paul UAE Golden Visa

Amala Paul UAE Golden Visa.. డస్కీ బ్యూటీ అమలాపాల్ గోల్డెన్ బ్యూటీ అయ్యింది. గోల్డ్ దక్కినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నానంటోంది. ఇది తనకు అరుదైన గౌరవమని కూడా అంటోంది అమలాపాల్. ఈ మలయాళ బ్యూటీ తెలుగు, తమిళం సహా పలు భాషల్లో సినిమాలు చేసింది.

విషయమేంటంటే, యూఏఈ ప్రభుత్వం ఆయా రంగాల్లో నిపుణులకూ, వ్యాపార వేత్తలకూ ఇలా కొన్ని విభాగాలకు చెందిన వారికి గోల్డెన్ వీసా అందిస్తోంది. సాధారణ యూఏఈ వీసాతో పోల్చితే, ఈ గోల్డెన్ వీసాకి చాలా ప్రత్యేకతలుంటాయ్. ప్రత్యేక సౌకర్యాలూ, ప్రత్యేక వెసులుబాట్లు.. ఇవన్నీ గోల్డెన్ వీసాని చాలా చాలా ప్రత్యేకంగా మార్చేసాయి.

Amala Paul UAE Golden Visa.. ఎలా వచ్చిందంటే..

యూఏఈ (UAE) అనగానే పెట్టుబడిదారులకు అలాగే ఉపాధి కోరుకునే వారికీ అత్యద్భుతమైన డెస్టినేషన్. పర్యాటక రంగం పరంగా చూసినా యూఏఈ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోనీ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది.

Amala Paul UAE Golden Visa
Amala Paul

అమలా పాల్ కంటే ముందు పలువురు సినీ ప్రముఖులకు గోల్డెన్ వీసాలు దక్కాయి. ఎక్కువగా మలయాళ సినీ పరిశ్రమకు చెందిన వారు ఈ గోల్డెన్ వీసాను దక్కించుకున్న వారిలో ఉన్నారు. తెలుగు నేల నుంచి తీసుకుంటే, ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ (Mega Power Star Ramcharan) సతీమణి ఉపాసన (Upasana Kamineni Konidela) ఇటీవలే గోల్డెన్ వీసా పొందారు.

ఆయా రంగాల్లో ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వారు సహా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, వాటిని పరిశీలించి గోల్డెన్ వీసా మంజూరు చేయడం జరుగుతుంది. ఇక, అమలాపాల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే, నటిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తోంది.

Also Read: బయోపిక్ భామలూ.. వెండితెర అద్భుతాలూ.!

తెలుగులో ‘బెజవాడా’, ‘నాయక్’ తదితర సినిమాల్లో అమలాపాల్ (Amala Paul) నటించింది. అమలా పాల్ నటించిన ‘ఆమె’ (Amala Paul Ame) సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయ్. జాతీయ స్థాయిలోనూ ఆమెకి నటిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group