Khiladi Trailer Review రవితేజ అంటేనే మాస్ మహరాజ్.. దానికి అదనంగా స్టైలిష్ ఆటిట్యూడ్.. అంతకు మించిన హై ఓల్టేజ్ ఎనర్జీ.! అలాంటి రవితేజ నుంచి కొత్త సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై అంచనాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఖిలాడీ’, ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. డింపుల్ హయాతీ, మీనాక్షి దీక్షిత్ కథానాయికలుగా నటిస్తున్నారు ఈ ‘ఖిలాడీ’ సినిమాలో.
డింపుల్ హయాతీ గతంలో ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయగా, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో సుశాంత్ సరసన హీరోయిన్‌గా నటించింది మీనాక్షి చౌదరి.
Khiladi Trailer Review.. కిర్రాకు డాన్సులు.. అందాల భామల హొయలు.!
‘ఖిలాడీ’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ సోషల్ మీడియాలో పెను సంచలనమే సృష్టించేస్తున్నాయి.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు తోడు, హీరోయిన్లు డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరిలతో రవితేజ డాన్సులు ఈ పాటలకు సూపర్బ్ ఎనర్జీని అద్దాయనడం అతిశయోక్తి కాదేమో.
అన్నట్టు, ‘ఖిలాడీ’ సినిమాని హిందీలో కూడా విడుదల చేస్తున్నారండోయ్. ఇక, ఈ సినిమా నుంచి ఊర మాస్ అండ్ స్టైలిష్ ట్రైలర్ తాజాగా బయటకు వచ్చింది.
ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు.. టాప్ క్లాస్.. అనే స్థాయిలో వున్నాయి అన్నీ. యాక్షన్, గ్లామర్, ఫన్.. అన్నీ దేనికవే. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. అన్నీ అద్భుతంగా కుదిరినట్టే వున్నాయి. రవితేజ అంటేనే ఎనర్జీ, ఆ ఎనర్జీని రెండింతలుగా చూపించినట్టున్నాడు దర్శకుడు.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
హీరోయిన్ల విషయానికొస్తే, ఇటు డింపుల్ హయాతీ అటు మీనాక్షి చౌదరి.. ఇద్దరూ గ్లామర్ పరంగా పోటీ పడ్డారని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు. పాటల ప్రోమోల్లోనే ఆ విషయం స్పష్టమయ్యింది. ట్రైలర్‌లో అయితే, ఇద్దరూ బికినీలతో సందడి చేసేశారు.
అనసూయ భరద్వాజ్ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ కానుందని ట్రైలర్‌లో ఆమెని చూస్తే అర్థమవుతోంది. డబ్బు చుట్టూ నడిచే కథ ఇది. ఎవరు ఎక్కువ మొత్తానికి నన్ను పాడుకుంటే, ఆ జట్టు కోసం ఆడే ఐపీఎల్ ప్లేయర్‌నంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
Also Read: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఈ భ్రష్టత్వం ఎవరిదప్పా.!
‘కసక్కు.. ఫసక్కు..’ అంటూ రవితేజ చెప్పే ఇంకో డైలాగ్ ట్రైలర్ మొత్తానికే హైలైట్ అనుకోవాలేమో. ఓవరాల్‌గా రవితేజ ఇంకో బాక్సాఫీస్ హిట్ కొట్టేందుకు ‘ఖిలాడీ’తో సర్వసన్నద్ధమయ్యాడనే భావించాలి.
Also Read: ఆ తప్పు చేయనంటోన్న అలియా భట్.!