బుల్లితెర రాములమ్మకి.. (Ramulamma Sree Mukhi Bigg Boss Jejemma) బుల్లితెర వీక్షకుల్లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ మాటకొస్తే, బుల్లితెర నటీనటుల్లో శ్రీముఖికి వున్నంత క్రేజ్ ఇంకెవరికీ లేదనడం అతిశయోక్తి కాదేమో. బుల్లితెర మీదనే కాదు, వెండితెరపైనా సత్తా చాటగల టాలెంట్ శ్రీముఖి సొంతం.
అయితే, వెండితెర కంటే, బుల్లితెర మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి శ్రీముఖి.. (Ramulamma Sree Mukhi Bigg Boss Jejemma) ఆ బుల్లితెరపై సృష్టించిన, సృష్టిస్తోన్న సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడీ బుల్లితెర రాములమ్మ, బిగ్‌బాస్ రియాల్టీ షో (Bigg Boss 3 Telugu) మూడో సీజన్‌తో దుమ్ము రేపేయబోతోంది.
శ్రీముఖి అంటే మాస్.. ఊర మాస్.! అంతేనా.? ఆమెలో ఇంకో యాంగిల్ కూడా వుంది. అదే, క్లాస్ యాంగిల్. క్లాస్ అయినా, మాస్ అయినా శ్రీముఖి కెవ్వు కేక అంతే.! బిగ్‌బాస్ రియాల్టీ షో థర్డ్ సీజన్ (Bigg Boss Telugu Season 3) ప్రారంభోత్సవంలో శ్రీముఖి హై ఓల్టేజ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది.
శ్రీముఖిలో (Sree Mukhi) ఇంత ఎనర్జీ వుందా.? అని ఎవరూ షాక్ అవలేదు. ఎందుకంటే, ఇలాంటి పెర్ఫామెన్సెస్ శ్రీముఖి ఎన్నో ఇచ్చేసింది. అందులో ఇది ఇంకోటి మాత్రమే. అయినాసరే, శ్రీముఖిని (Ramulamma Sree Mukhi Bigg Boss Jejemma) అంత హై ఓల్టేజ్ ఎనర్జీతో చూస్తే.. ఆమె అభిమానులకి వచ్చే ఆ కిక్కే వేరప్పా.
బిగ్ బాస్ సీజన్ 3 (Bigg Boss Season 3 Telugu) తెలుగు రియాల్టీ షో విజేత శ్రీముఖి (Sree Mukhi) మాత్రమే.. అంటూ అభిమానులు ఆల్రెడీ ఫిక్సయిపోయారు. అందుకు అవసరమైన ఆటిట్యూడ్‌తో బిగ్‌హౌస్‌లోకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసింది. తన ట్రేడ్ మార్క్ ‘రాములమ్మ’ స్టెప్పులతో బిగ్‌బాస్ ఓపెనింగ్ సెర్మానీలో శ్రీముఖి ఇచ్చిన పెర్ఫామెన్స్.. మొత్తంగా ఈ ఈవెంట్‌లో మిగతా పెర్ఫామెన్స్‌లన్నిటికీ ‘బాప్’ అంటే అది అతిశయోక్తి కాదేమో.
బిగ్‌బాస్ కాన్సెప్ట్ (Bigg Boss)తనకు చాలా నచ్చిందనీ, ఆ కారణంగానే ఈ రియాల్టీ షోకి ఒప్పుకున్నాననీ, బిగ్ బాస్ కోసమే, తన కమిట్‌మెంట్స్ అన్నీ పక్కన పెట్టేశానని శ్రీముఖి చెప్పింది. చూస్తోంటే, ఆమె ఖచ్చితంగా టైటిల్ కొట్టేలానే వుంది.
ఆల్రెడీ శ్రీముఖి ఆర్మీ (Sree Mukhi Army) పేరుతో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హల్‌చల్ షురూ చేశారు. అదే సమయంలో శ్రీముఖికి ‘యాంటీస్’ కూడా తయారైపోయారు. ఆమెపై దుష్ప్రచారం మొదలు పెట్టేశారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.. బుల్లితెర రాములమ్మ.. బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎలా జేజెమ్మలా మారబోతోందో.!