Table of Contents
Bindu Madhavi Bigg Boss: తొలి తెలుగు సినిమా ‘ఆవకాయ్ బిర్యానీ’ (Avakay Biryani)తో హిట్టు కొట్టకపోయినా, ‘ఈ అమ్మాయిలో విషయం వుంది..’ అనే అభిప్రాయం అప్పట్లో చాలామందిలో వ్యక్తమయ్యింది. ఆ తర్వాత ‘బంపర్ ఆఫర్’ (Bumper Offer) సినిమాతో నిఖార్సయిన హిట్టు కొట్టింది ఈ తెలుగు బ్యూటీ.
ఏమయ్యిందోగానీ, తెలుగులో అవకాశాలు వస్తున్నా, ఆమె (Bindu Madhavi) చూపు తమిళ సినిమా వైపు మళ్ళింది. అలా తమిళ సినిమాల్లో నిలదొక్కుకుండా. అక్కడ బాగానే అవకాశాలు దక్కించుకుంది.. చిన్న చిన్న విజయాలూ అందుకుంది.
అన్నట్టు, తెలుగులో రామ్ పోతినేని (Ram Pothineni) సరసన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ (Rama Rama Krishna Krishna) సినిమాలో బిందు మాధవి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
Bindu Madhavi Bigg Boss.. ఇంతకీ బిందు మాధవి ప్రేమికుడెవరు.?
బిందు మాధవి ప్రేమలో పడిందంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసేసింది. ఆ ‘కూతల్లో’ వాస్తవం వుందని సాక్షాత్తూ బిందు మాధవి కూడా ఒప్పుకుందిగానీ, అతనెవరో చెప్పలేదు. అప్పటికీ ఇప్పటికీ అదో సస్పెన్స్.
తమిళ బిగ్ బాస్.. ఆ తర్వాత తాజాగా తెలుగు బిగ్ బాస్.. ఇలా రియాల్టీ షోల వైపు దృష్టి సారించడానికి బలమైన కారణమే వుందని బిందు మాధవి అంటోంది. ప్రేమలో విఫలమయ్యాక, ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి ‘బిగ్ బాస్ రియాల్టీ షో’ని ఎంచుకున్నట్లు చెప్పింది ఈ తెలుగు బ్యూటీ.
తమిళంలో అలా.. తెలుగులో ఇలా.!
తమిళ బిగ్ బాస్ (Bigg Boss Tamil) ద్వారా బాగానే పాపులారిటీ పెంచుకుంది. అయితే, ఫైనల్ వీకెండ్‌లో బిందు మాధవి షాకింగ్ డెవలప్మెంట్‌లో భాగంగా ఎలిమినేట్ అయ్యింది. అంటే, చివరి వారం వరకు బిగ్ హౌస్‌లో వుందన్నమాట.
Also Read: హేయ్ అవంతిక.! నీలో చాలా విషయం వుందే.!
ఇక, తెలుగు (Bigg Boss Telugu) బిగ్ బాస్ (ఓటీటీ వెర్షన్.. బిగ్ బాస్ నాన్ స్టాప్)లోకి రావడానికి కారణం చెబుతూ, అనుకోకుండా తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాననీ, ఇలా బిగ్ బాస్ (Bigg Boss Telugu) ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటున్నాననీ చెప్పింది బిందు మాధవి.
ప్రేమికుడు కాదు.. ప్రేమికులు.!
బిందు మాధవి ఒకసారి కాదు, రెండుసార్లు ప్రేమలో పడిందన్నది తమిళ సినీ వర్గాల్లో జరిగిన ప్రచారం. అందులో ఒకరు సింగింగ్ నుంచి నటన వైపు వచ్చిన వ్యక్తి అట. మరొకరేమో నటుడు.. అంటూ బోల్డన్ని గాసిప్స్ మామూలే. ఇంతకీ ఏది నిజం.? అది మాత్రం ఆమెకే తెలుసు.
అయితే, ఎవర్ని తాను ప్రేమించి ఆ తర్వాత ప్రేమలో ఫెయిలయ్యిందీ ఎప్పటికీ చెప్పబోనని విందు మాధవి (Bindu Madhavi) తేల్చి చెప్పేసింది. ఎందుకింత సీక్రెసీ.! ఏమో మరి, ఆమెకే తెలియాలి.