Table of Contents
Anasuya Bharadwaj Happy Fools Day: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫిలిం మేకర్ ఒకడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పొద్దంటాడు. ఏవన్నా పండగలొస్తే సెలబ్రేట్ చేసుకోవద్దంటాడు. అన్నిటికీ వక్రభాష్యాలు చెబుతుంటాడు. అందరిదీ ఒక దారయితే, ఆయనది ఇంకో దారి.
ఏం చేస్తాం. ఎలాగోలా నలుగురి నోళ్లలో నానాలంటే, వింతగానే ప్రవర్తించాలి మరి. పబ్లిసిటీ కోసం కక్కుర్తి పడే చాలా మంది ఇలాంటి వేషాలు వేస్తుంటారు. ఇదో వెకిలి ట్రెండ్.
అత్యున్నత శిఖరాల్ని అధః పాతాళంతో చూడడం ఓ వికృత పబ్లిసిటీ క్రీడ ఆయనకి. సోషల్ మీడియా అంటేనే వెర్రితలలు వేయడానికి అసలు సిసలు వేదిక అని భావిస్తుంటాడాయన.
‘అంతా నా ఇష్టం..’ అంటూ అడ్డగోలు పైత్యాన్ని రుద్దుతుంటాడు. అదో టైపు క్రియేటివిటీ మరి.
Anasuya Bharadwaj Happy Fools Day.. మహిళా దినోత్సవమా.? మూర్ఖుల దినోత్సవమా.?
అసలు విషయంలోకి వస్తే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ‘హ్యాపీ ఫ్యూల్స్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒకింత వింతగా స్పందించింది అనసూయ. ‘హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ ట్వీటేసింది.
అనునిత్యం మహిళల్ని సోషల్ మీడియా వేదికగా కించపరిచే వాళ్లు అనూహ్యంగా మహిళా దినోత్సవం రోజున ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు..’ అంటూ విషెస్ చెప్పడాన్నిఅనసూయ ఖండిస్తూ, బహుశా ఇలా ట్వీటేసిందని అనుకోవాలేమో.

ఓ మహిళగా తనను ట్రోల్ చేసే వాళ్లపై అనసూయ ఆవేదన వ్యక్తం చేస్తే తప్పు పట్టడానికేమీ లేదు. కానీ, అందరూ అలాంటోళ్లే వుండరు కదా. సినిమా కోసమో, లేకపోతే కామెడీ స్కిట్స్ కోసమో రకరకాల వేషాలేస్తూంటుంది అనసూయ.
ట్రోలింగ్.. మీమ్స్.. అదంతా వేరే కథ.!
ఆయా పాత్రలపై పాజిటివ్ కామెంట్లు రావచ్చు. నెగిటివ్ కామెంట్లూ రావచ్చు. వాటిని తట్టుకోలేనంటూ అనసూయ గుస్సా అయితే ఎలా.?
తనదైన అభిప్రాయాల్ని అనసూయ ఎలాగైతే కుండ బద్దలుకొట్టేస్తుందో, అనసూయ మీద నెటిజన్లకు వున్న అభిప్రాయాల్ని కూడా ట్రోల్స్ రూపంలోనో, మీమ్స్ రూపంలోనో అలా బయటపెడుతుంటారు.
Also Read: చిక్కు ప్రశ్న.. అనసూయ భరద్వాజ్‌ని ఏమని పిలవాలి.?
సరే, అభ్యంతరకరమైన రీతిలో ట్రోల్స్, మీమ్స్ వుంటే, వాటినెవరూ సమర్ధించరు. సమర్ధించకూడదు కూడా. కానీ, ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో దేన్నీ నివారించలేం కదా.
అనసూయ అందుకే వెరీ వెరీ స్పెషల్.!
అందరిలా సాటి మహిళా లోకాన్ని వుద్దేశించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెబితే, అందులో కిక్కేముంది. అదే ‘హ్యాపీ ఫూల్స్ డే’ అనేస్తే పబ్లిసిటీ కిక్కు లభిస్తుంది కదా. ఆ కిక్కు కోసమే అనసూయ ఇలా చేసిందనుకోవాలా.?
తనను ట్రోల్ చేసేవారికీ, తనపై మీమ్స్ వేసే వారి కోసం, ‘హ్యాపీ ఫూల్స్ డే..’ అని అనసూయ (Anasuya Bharadwaj) స్పందించినా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ట్వీట్ యావత్ మహిళా లోకాన్ని అవమానించేలా వుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
మహిళలకు దక్కాల్సిన గౌరవం ఎప్పుడూ దక్కుతుంటుంది. అయినా మహిళకు ఎవరో ప్రత్యేకంగా గౌరవం ఇవ్వడమేంటీ.? మహిళ ఓ అద్భుతం. ప్రతి మగాడూ ఇది ఒప్పుకోవల్సిందే. ఇదే నిజం.
ఇక ట్రోల్స్, మీమ్స్ అంటారా.. మహిళల మీదే కాదు, మగాళ్ల మీదయినా అవి ఇబ్బందికరంగానే వుంటాయ్. వాళ్లూ, వీళ్లూ అందరూ వీటికి బాధితులే. నిజానికి, దేవుళ్ళు కూడా ఈ ట్రోలింగ్‌కి అతీతమేమీ కాదన్నట్టు తయారైంది పరిస్థితి.