RRR Celebration Anthem: ఇంతకు మించిన సెలబ్రేషన్ ఇంకేముంటుంది.?
తెరపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR).. జోరు జోరుగా స్టెప్పులు వేసేస్తోంటే అభిమానులు మైమర్చిపోవాల్సిందే. అది ‘నాటు నాటు’ పాట అయినా, ‘ఎత్తర జెండా’ పాట అయినా.! ఆ ఫీలింగ్ సేమ్ టు సేమ్.!
‘నాటు నాటు’ (Naatu Naatu Song) పాట పూర్తిగా మాస్ సాంగ్ అయితే, ‘ఎత్తర జెండా’ (Etthara Jenda) పాటలో దేశభక్తి వుంది.
పలువురు మహనీయుల్ని ఈ పాటలో చూపించారు.. అందుకు తగ్గట్టుగా రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీయార్ (Jr NTR) గెటప్స్ వున్నాయి. ఆ ఇద్దర్నీ చూసేందుకే రెండు కళ్ళూ సరిపోవడంలేదంటే, అంతకు మించి.. అన్నట్టుంది అలియా భట్ (Alia Bhatt).
RRR Celebration Anthem.. అలియా.. అంతకు మించి.!
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాలో అలియా భట్ పాత్ర గురించి తొలుత జరిగిన ప్రచారానికీ, సినిమా ప్రచారంలో ఆమెకు లభిస్తున్న ప్రాధాన్యతకీ అస్సలు సంబంధమే లేదు. సినిమా అంతా చరణ్ (Charan), ఎన్టీయార్ (NTR) సహా అలియా భట్ (Alia Bhatt) కూడా వున్నట్లే కనిపిస్తోంది.
ఏ పాటకి ఆ పాటే.. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశమే.. జక్కన్న (Jakkanna Rajamouli) చెక్కితే ఒకదాన్ని మించి ఇంకోదాని అందం కనిపిస్తుంది. అది పాట అయినా, సాధారణ సన్నివేశమైనా, పోరాట దృశ్యమైనా.
డాన్స్.. డాన్స్.. డాన్స్.!
‘ఎత్తర జెండా’ పాట నిజంగానే ఓ అద్భుతం.. మేకింగ్ పరంగా. డాన్సుల విషయంలో ఎన్టీయార్, రామ్‌చరణ్‌లలో ఎవరికీ వంకలు పెట్టలేం. అభిమానులకైతే ఇది నిజంగానే కన్నుల పండుగ. అభిమానులు కానివారికీ.. ఇదో అద్భుతంగానే కనిపిస్తోంది. దటీజ్ రాజమళి (SS Rajamouli).

ఇప్పుడే అన్నీ చూపించేస్తే, సినిమాలో రాజమౌళి ఇంకేం అద్భుతాలు దాచినట్టు.? అదే రాజమౌళి ప్రత్యేకత. ఎంత చూపించినా, ఇంకా ఇంకా అక్కడ అద్భుతాలు మిగిలే వుంటాయి వెండితెరపై ప్రత్యేకంగా చూడటానికి.
Also Read: సమంత అందాల దాడి.! ఊ అంటారా.. ‘నో’ అనగలరా.!
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) తెలుగు తెరపై ప్రస్తుతానికి అతి పెద్ద మల్టీస్టారర్. ఇంతకు మించి ఇంకేముంటుంది.? అని రాజమౌళి సినిమాల్ని చూసిన ప్రతిసారీ అనిపిస్తుంటుంది.
ప్రతిసారీ అంతకు మించి.. అనేలానే ఔట్‌పుట్ ఇస్తుంటాడు. అదే రాజమౌళి (RRR Celebration Anthem) ప్రత్యేకత.