Rahul Ramakrishna.. మామూలుగా పెళ్ళి కబురు చెబితే కిక్కేముంటుంది.? అందుకే, కొత్తగా ఆలోచించాడు కమెడియన్, పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన టాలెంటెడ్ నటుడు రాహుల్ రామకృష్ణ.
‘అర్జున్ రెడ్డి’, ‘కల్కి’, ‘జాతి రత్నాలు’ సహా చాలా సినిమాల్లో రాహుల్ రామకృష్ణ తనదైన నటతో మెప్పించాడు. అడపా దడపా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తుంటాడీ నటుడు.
అసలు విషయమేంటంటే, రాహుల్ రామకృష్ణ పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. అమ్మాయి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఫొటో అయితే రివీల్ చేసేశాడు. ఆమె ఎవరో మాత్రం వివరాలు చెప్పలేదు.
తాను పెళ్ళి చేసుకోబోతున్న విషయాన్ని ప్రకటిస్తూ ఓ పొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రాహుల్ రామకృష్ణ. రొటీన్ ఫొటో కాదది. గాఢమైన లిప్ లాక్ సన్నివేశంతో కూడిన ఫొటో అది.
Rahul Ramkrishna ఏందయ్యా ఈ ఘోరం.!
తన ప్రియురాల్ని గాఢంగా ముద్దు పెట్టేసుకుంటూ.. ఆ ఫొటో ద్వారా పెళ్ళి కబురు చెప్పాలనే ఐడియా రాహుల్ రామకృష్ణకి ఎలా వచ్చిందో ఏమో.!
అన్నట్టు, హీరో విశ్వక్ సేన్.. ఓ ఛానల్ యాంకర్ మధ్య జరిగిన ‘యాగీ’ గుర్తుంది కదా.? ఆ విషయంలో విశ్వక్ సేన్‌కి పూర్తి మద్దతిస్తూ, ఆ ఛానల్‌ని ఏకి పారేశాడు రాహుల్ రామకృష్ణ.
ఆ వివాదానికి కొనసాగింపుగా, తన పెళ్ళి కబురు చెబుతూ.. తాను పోస్ట్ చేసిన ఫొటో మీద డిబేట్లు పెట్టాలంటూ సదరు ఛానల్‌కి సెటైర్లు కూడా వేసేశాడు. వార్వెవా.! ఏం తెలివి బాసూ.!
విశ్వక్ సేన్ (Vishwak Sen) విషయంలో ఓవరాక్షన్ చేసిన సదరు ఛానల్, రాహుల్ రామకృష్ణని మాత్రం లైట్ తీసుకుందండోయ్. బహుశా విశ్వక్ సేన్ ఎపిసోడ్‌తో సదరు ఛానల్‌కి బొప్పి కట్టి వుంటుంది.
ప్చ్.! ఆ ఛానల్‌ని రాంగ్ టైమ్‌లో కెలికినట్టున్నాడు.. ఆశించిన పబ్లిసిటీ అయితే పొందలేకపోయాడు.!
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
ఈ రోజుల్లో ఏం చేసినా పబ్లిసిటీ కోసమే అన్నట్టు తయారైంది వ్యవహారం. కొన్ని న్యూస్ ఛానళ్ళు కూడా అలాగే తయారయ్యాయ్. వెబ్ మీడియా సంగతి సరే సరి.
అందుకేనేమో, సెలబ్రిటీలు కూడా మీడియాతో ఆడుకోవడం మొదలెట్టారు.. మీడియా, సెలబ్రిటీలతో ఆడుకోవడం పాత వ్యవహారమే లెండి.!