Sonakshi Sinha.. వేలికి ఉంగరం పెట్టుకుని కనిపిస్తే, ఎంగేజ్మెంట్ అయిపోయినట్టేనా.? పెళ్ళికి సిద్ధమైపోయినట్టేనా.? ఏ జనామాలో వున్నారు మీరంతా.?
బహుశా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇలాగే మీడియాకీ, తనను ట్రోలింగ్ చేస్తున్నవారికీ క్లాస్ తీసుకుంటుందేమో.!
అసలేమయ్యింది సోనాక్షి సిన్హాకి.? ఏమీ కాలేదు. ఆమె మామూలుగానే వుంది. కాకపోతే, ఓ చిన్న పబ్లిసిటీ స్టంట్ చేసిందంతే.
Sonakshi Sinha.. ప్రేమలో పడింది.!
సోషల్ మీడియా వేదికగా, సోనాక్షి సిన్హా.. వేలికి ఉంగరం కలిగి వున్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దాంతో, సోనాక్షి సిన్హా పెళ్ళి చేసుకోబోతోందనీ, ఎంగేజ్మెంట్ అయిపోయిన విషయాన్ని ఇలా చెబుతోందంటూ గాసిప్స్ షురూ అయ్యాయ్.
జనాల్లో క్యూరియాసిటీ పెంచడానికి ‘లవ్’ అని పేర్కొంటూ ఎడా పెడా ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. చివరికి అసలు ‘లవ్’ దేని మీదనో చెప్పేసింది.

కొత్తగా ‘ఎంటర్ప్రెన్యూర్’ అవతారమెత్తింది సోనాక్షి సిన్హా. తన వ్యాపారమే తన కొత్త ప్రేమ అట. ఇంతకీ, ఆ వ్యాపారమేంటి.? అంటే, ‘గోళ్ళకు గ్లామర్ అద్దడం’. ఇదేం పత్తి యాపారం.. అనే డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు.!
ఈ యాపారం కథ వేరే వుంటది.!
నఖ శిఖ పర్యంతం.. అని పెద్దలు ఊరకనే అనలేదు. కురులకు సరికొత్త అందాల్ని అద్దుతున్నప్పుడు, గోళ్లకి మాత్రం ఎందుకు కొత్త గ్లామర్ అద్దకూడదు.?
ట్రెండ్ మారింది.! అన్నీ మారాయ్. కేవలం గోళ్ళ గ్లామర్ కోసమే లక్షలు ఖర్చు చేసేవారూ లేకపోలేదు. అందుకే, సోనాక్షి తెలివిగా ఈ వ్యాపారంలోకి దిగింది.
దీపం వుంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు, గ్లామర్ అలాగే పాపులారిటీ వున్నప్పుడే.. ఇలాంటి వ్యాపారాలకు దిగుతుంటారు ముద్దుగుమ్మలు. సోనాక్షి సిన్హా ఇందుకు మినహాయింపేమీ కాదన్నమాట.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
అయినా, ఇదేం వ్యాపారం.? అంటూ సోనాక్షి సిన్హా మీద నెటిజన్లు గుస్సా అవుతున్నారు. అయితే, గోర్ల గ్లామర్ గురించి తెలిసినోళ్ళు మాత్రం, ‘తెలివైన వ్యాపారివే సుమీ’ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.
మరోపక్క, ‘నీ వ్యాపారం కోసం.. ఎంగేజ్మెంట్, పెళ్ళి అనే అర్థాలొచ్చేలా పిచ్చి పిచ్చి పబ్లిసిటీ స్టంట్లు చేస్తావా.?’ అంటూ షరామామూలుగానే సోనాక్షి సిన్హా మీద నెగెటివ్ ట్రోలింగ్ నడుస్తోంది.