Table of Contents
Sarkaru Vaari Paata Review.. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘సర్కారు వారి పాట’ సినిమా. కోవిడ్ పాండమిక్ తర్వాత, పలు ఇంట్రెస్టింగ్ సినిమాలొచ్చాయి.. కొన్ని డిజాస్టర్ సినిమాలూ వచ్చాయి.
వాటన్నిటితో పోల్చితే, ‘సర్కారు వారి పాట’ సినిమా ఎందుకు భిన్నమైనది.? అంటే, ఇది కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్.. అని చెప్పారు మేకర్స్.!
సూపర్ స్టార్ మహేష్‌బాబుని తెరపై చూస్తే అభిమానులు పూనకంతో ఊగిపోతారు. హై ఓల్టేజ్ మాస్ అండ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో.. మహేష్ చెలరేగిపోతాడనే అంచనాలు అభిమానుల్లో వున్నాయ్.
మహానటి కీర్తి సురేష్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? కళావతిగా కలర్‌ఫుల్‌గా కనిపించనుందని ప్రోమోస్‌తో అర్థమయిపోయింది. దాంతో, ఆ ‘గ్లామర్ వల’లో అభిమానులు పడిపోయారు.
నదియా, సముద్రఖని, వెన్నెల కిషోర్.. ఇలా కాస్టింగ్ పరంగా చూసుకున్నా, సినిమాపై అంచనాలు అనూహ్యంగా క్రియేట్ అయ్యాయి. ఇంతకీ, ‘సర్కారు వారి పాట’ కథా కమామిషు ఎలా వున్నాయ్.?
Sarkaru Vaari Paata Review.. ఇదండీ సర్కారు వారి పాట కథా కమామిషు.!
తీసుకున్ అప్పు తీర్చలేక, ఆత్మహత్య చేసుకుంటారు హీరో తల్లిదండ్రులు. దాంతో, డబ్బు మీద బాధ్యతతో కూడిన వ్యామోహం పెంచుకుంటాడు హీరో.
ఇంకోపక్క, ఆ డబ్బుని విచ్చలవిడిగా తన జల్సాల కోసం ఖర్చు చేస్తుంటుంది హీరోయిన్.. పైగా, అప్పు చేసి మరీ ఆమె జల్సాల్లో మునిగి తేలుతుంది.
హీరో దగ్గరే అప్పులు చేసే ఆ కళావతి, అప్పులు వసూలు చేయడంలో దిట్ట అయిన హీరోనే బురిడీ కొట్టిస్తుంది.
దాంతో, అప్పు వసూలు చేయడానికి ఆమె తండ్రి దగ్గరకొస్తాడు అమెరికా నుంచి మన హీరో. అదే పెద్ద ట్విస్ట్, అనుకుంటే, ఇందులో బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు.. ఇలా కథ ఇంకో టర్న్ తిరుగుతుంది.
ఇంతకీ, మన హీరో తన దగ్గర అప్పు చేసిన హీరోయిన్ నుంచి వసూలు చేయగలిగాడా.? బ్యాంకింగ్ లోపాల సంగతేంటి.? పది వేల కోట్ల అంశమేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
సూపర్ స్టార్ మహేష్.. హ్యాండ్సమ్ ఎనర్జీ.!
నో డౌట్, సూపర్ స్టార్ మహేష్‌బాబు వయసు తగ్గుతోంది. అలా వయసు తగ్గేందుకు మహేష్ ఎంత కష్టపడుతున్నాడో.. ‘దూ.. తీరిపోతోంది..’ అని సినిమాలో చెప్పే డైలాగ్‌తోనే అర్థం చేసుకోవచ్చు.

పవర్ ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ రోల్ మహేష్ చేశాడు. కీర్తి సురేష్ (Keerthy Suresh) ‘రంగ్ దే’ సినిమాలోనూ నెగెటివ్ టచ్ వున్న రోల్ చేసింది. ఇందులోనూ అదే తీరు కనిపిస్తుంది.
కొన్ని సీన్లు సూపర్బ్‌గా అనిపిస్తాయ్.. కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయ్.. హై ఓల్టేజ్ యాక్షన్ కూడా వుంది. కానీ, కథ అలాగే కథనాలే అటకెక్కాయ్.
తెరపై ఏదేదో జరుగుతుంటుంది. అంతా బాగానే వుందని థియేటర్లో అనిపించడం మామూలే. బయటకొచ్చాక, ఏం చూశాం.? అంటే, అర్థం కాని పరిస్థితి.
పోకిరి.. దూకుడు.. మహేష్ ఎందుకలా అన్నాడు.?
‘పోకిరి’ అన్నాడు, ‘దూకుడు’ అన్నాడు.. మహేష్ (Super Star Maheshbabu) ఏవేవో చెప్పాడు సినిమా ప్రమోషన్స్‌లో. కానీ, అంత లేదు ‘సర్కారు వారి పాట’ సినిమాలో.
Also Read: చెడగొడుతున్నావ్ ప్రభాస్: ‘లోఫర్’ భామ దిశా పటానీ.!
భారీగా ఖర్చు చేశారు, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. పాటలూ బాగున్నాయ్.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కింగ్ అయిన తమన్, ఈసారి సన్నివేశాల్ని డామినేట్ చేసేందుకు ప్రయత్నించి బోల్తా పడ్డాడు.
కథ, కథనాల గురించి ఆలోచించకుండా మహేష్ కోసమే సినిమా చూస్తామంటే, అభిమానులకి ఇది ఐ ఫీస్ట్.! అంతకు మించి, మాట్లాడుకోడానికేమీ లేదంతే.!