Pawan Kalyan.. ఎవరో ఎవరికో దత్తత వెళితే ప్రజలకేంటి నష్టం.? కనీసపాటి ఇంగితం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పదవుల్లో వున్న నాయకులు తమ స్థాయిని రోజురోజుకీ మరింత దిగజార్చేసుకుంటున్నారు.
ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ‘దత్తత’ పేరుతో విషం చిమ్ముతున్నారు కొందరు. ఈ విమర్శ చేయడానికి కనీసపాటి ఇంగితం వుండాలి ఎవరికైనా. అదే వుంటే, రాజకీయ నాయకులెందుకవుతార్లెండి.!
ఇంకెవరికైనా అయితే, ఎంగిలిమెతుకులు అవసరమేమో.! కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఆ అవసరమే లేదు. ఆయనది పెట్టే చెయ్యి తప్ప, చాచే చెయ్యి ఏమాత్రం కాదు.! పవన్ కళ్యాణ్ మీద ‘దత్తత’ విమర్శలు చేస్తున్నవారికీ అది తెలుసు.
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లోకి వెళ్ళి, సినిమాలకు గుడ్ బై చెప్పేయాలనుకున్నా, సినీ పరిశ్రమ ఆయన్ని వదల్లేదు.
Pawan Kalyan అమ్ముడుపోయేటోడేనా.?
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా అమ్ముడుపోయేవాడే అయితే, ఒక్కసారి అమ్ముడుపోయాక.. ఆ తర్వాత ఏ పార్టీకి అయినా అమ్ముడుపోతాడు కదా.? ఆ లెక్కన ఎవరైనా ఆయన్ని కొనుక్కోవచ్చు కదా.?
సినిమాల్ని ఆపేయాలని రాజకీయం కుట్ర చేసినా, ‘మనల్ని ఎవడ్రా ఆపేది.?’ అని ధైర్యంగా నిలబడ్డాడు.

అంతేనా, ‘మీకు అంతగా కక్ష వుంటే నా సినిమాల్ని ఆపేసుకోండి, కానీ, తెలుగు సినీ పరిశ్రమలో మిగతా సినిమాల్ని అడ్డుకోవద్దు..’ అని చెప్పగలిగిన దమ్మున్నోడు పవన్ కళ్యాణ్.
సూర్యుడిపైన ఉమ్మేసినట్టే.!
మంత్రులు, ఓ సినిమా మీద పడి నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం ఎక్కడన్నా చూశామా.? లేదే.! దటీజ్ పవన్ కళ్యాణ్. ఆయనంటే అంత వణుకు, ‘ముఖ్య’మైన పదవుల్లో వున్నవారికి.
సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది.? పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు’ అనే విమర్శలు చేస్తే అదే అవుతుంది.!
పవన్ కళ్యాణ్‌ని డబ్బలతో కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదని ఆయన అభిమానులు బలంగా నమ్ముతారు. అదే నిజం కూడా.!
Also Read: ఏంటి దేవీ మరీనూ.! విశ్వక్ సేనుడి ‘రగడ’తో ఏం సాధించినవ్.!
మూడు పెళ్ళిళ్లనీ, దత్తత పుత్రుడనీ.. పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకోవడం ద్వారా వచ్చే ‘రాజకీయ లబ్ది’ ఏంటి.? అనే విజ్ఞత లేనోళ్ళు, రాజకీయాల్లో ‘ముఖ్య’మైన నాయకులుగా చెలామణి అవుతున్నారు.
రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంకేం నిదర్శనం కావాలి.?
			        
														