Happy Birthday Young Tiger NTR.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు పోలికలే కాదు, నట వారసత్వం కూడా యంగ్ టైగర్ ఎన్టీయార్ సొంతమని నందమూరి అభిమానులు భావిస్తుంటారు.
అందులో నిజం లేకపోలేదు.! యంగ్ జనరేషన్ హీరోలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు యంగ్ టైగర్.
మొన్నీమధ్యనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) పోషించిన పాత్రకి దేశమంతా ఫిదా అయిపోయింది.. ఆయన నటన అద్భుతమని కొనియాడింది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ అంటే కేవలం తెలుగు హీరో మాత్రమే కాదిప్పుడు.. పాన్ ఇండియా యంగ్ టైగర్ ఇకపై.! చేయబోయే సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా సినిమాలే ఇక నుంచి యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి.

నటుడిగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సాధించిన సక్సెస్‌తో బాధ్యత మరింత పెరిగిందని భావిస్తానంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ తనదైన స్టయిల్లో చెప్పుకొచ్చాడంటే, నటన పట్ల అతనికున్న ఆరాధనాభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
మాస్ అయినా.. క్లాస్ అయినా.. తారక రాముడి రూటే సెపరేటు.!
‘సినిమా వసూళ్ళ లెక్కల్ని నిర్మాత చూసుకుంటారు.. వాటితో నాకు పని లేదు. సినిమా కోసం ఏం చేయాలి.? ఎంత చేయాలి.? అన్నది మాత్రమే నేను ఆలోచిస్తాను..’ అని చెబుతుంటాడు యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR).
Also Read: BEAST Review.. ‘రా’ ఏజెంట్.! సీరియస్‌గా కామెడీ అయిపోయినవ్.!
క్లాస్ అయినా, మాస్ అయినా యంగ్ టైగర్ రూటే సెపరేటు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ క్లాస్ హిట్ ఇచ్చినా, ‘అరవింద సమేత’ అంటూ మాస్ హిట్ కొట్టినా యంగ్ టైగర్ ఎన్టీయార్‌కే (Young Tiger NTR) సొంతం.
సెటిల్డ్ పెర్ఫామెన్స్.. హై ఓల్టేజ్ మాస్ యాక్షన్.. దేన్నయినా పండించగల సత్తా వున్నోడు.. డైలాగ్ డెలివరీలో తాతకు తగ్గ మనవడు కూడా.!
Happy Birthday Young Tiger NTR.. పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు.!
చిన్న వయసులోనే నటుడిగా కెరీర్ ప్రారంభించి, నూనూగు మీసాల వయసులోనే నటుడిగా పూర్తి పరిణతి సాధించిన యంగ్ టైగర్ ఎన్టీయార్‌లో పాన్ ఇండియా ఇమేజ్ తర్వాత సరికొత్త మార్పు కనిపిస్తోంది.
Also Read: నిత్యానంద కైలాసం.! సమాధిలో అయ్యోరి సయ్యాట.!
కథల ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకుంటానని ప్రతిసారీ చెప్పేమాటే ఇంకోసారి గట్టిగా బల్లగుద్ది చెబుతున్నాడీ యంగ్ నందమూరి తారకరామారావు.
బుల్లితెరపైనా నందమూరి తారకరాముడు అందరివాడైపోయాడు బిగ్ బాస్ తెలుగు రియాల్టీ సీజన్ వన్ ద్వారా. అంతేనా, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ మరింత ఆప్తుడయ్యాడు బుల్లితెర వీక్షకులకి.
మామూలుగానే యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టినరోజు అంటే అభిమానులకు పెద్ద పండగే. ఈసారి ఇంకాస్త స్పెషల్. ఎందుకంటే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీయార్ రేంజ్ మరింత పెరిగింది.
సో, ఇప్పుడు జరగబోతోన్న యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టినరోజు వేడుకల వ్యవహారం.. పాన్ ఇండియా పండగ అన్నమాట.
బాల నటుడిగా చేసినప్పటినుంచి, పాన్ ఇండియా హీరోగా మారే వరకు.. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో నటుడిగా ఏనాడూ కమిట్మెంట్లో తగ్గేదే లే.. అంటాడీ జూనియర్ నందమూరి తారకరాముడు.
ఆ విశ్వ విఖ్యాత నటసార్వభౌముడి స్థాయిని ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఈ యంగ్ టైగర్ అందుకోవాలన్నది నందమూరి అభిమానుల కోరిక.
హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ ఎన్టీయార్.!
Happy Birthday Young Tiger NTR.