Table of Contents
Save Soil Publicity Stunt.. సేవ్ సాయిల్.! మట్టిని రక్షించండి.! సద్గురు అట.. ఒక పెద్దాయన అందించిన సందేశమిది. నిజానికి, ఇది కొత్త సందేశం కాదు.! ఎప్పటినుంచో వున్నదే.. మనం విస్మరిస్తున్నదే..
రైతు, మట్టిని నమ్ముకుంటాడు.. ఆ మట్టి నుంచే పంటను సృష్టిస్తాడు.. తనతోపాటు ప్రజలందరినీ రైతు బతికిస్తాడు.! ఇది జగమెరిగిన సత్యం.
కానీ, అసలు రైతు ధైర్యంగా, ఆనందంగా వ్యవసాయం చేసే పరిస్థితి ఇప్పుడుందా.? ఆ మట్టిలోకి ఎరువుల రూపంలో, పురుగు మందుల రూపంలో రైతు ఏం పంపుతున్నాడు.? ఇవేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ కావు.!
Save Soil Publicity Stunt పబ్లిసిటీ పైత్యం కాక మరేమిటి.?
మట్టిలోకి విషాన్ని పంపుతున్నాం. అలా విషం నిండిన భూమి నుంచి పుట్టే విషపూరితమైన ఆహారాన్నే తింటున్నాం. సో, మట్టిని రక్షించండి.. అంటూ ఇప్పుడు నినదించడం వల్ల ప్రయోజనమేముంది.?
నిజానికి, ఇదొక పబ్లిసిటీ స్టంట్.. అనే వాదన లేకపోలేదు. ప్రభుత్వాలు, చెట్ల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నాయి. ఇందుకోసం కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

అవే ప్రభుత్వాలు, నగరాల్ని విస్తరించడం కోసం పచ్చదనాన్ని హరిస్తున్న వైనాన్ని చూస్తూనే వున్నాం. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్ డాష్.. అంటే ఇదే మరి.!
చెప్పేవి శ్రీరంగ నీతులు..
మనిషి మనుగడ మట్టి మీదనే ఆధారపడి వుంది. కానీ, ఆ మట్టిని ఎప్పుడో మలినం చేసేశాం. మట్టిని దోచేస్తున్నాం. ఔను, ఆ మట్టి నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది మరి.!
Also Read: చైనా ఏలియన్స్.! నమ్మి తీరాలి బాసూ.!
ఇక, మట్టిని ఎలా కాపాడేది.? ప్రచారం కోసం ‘సేవ్ సాయిల్’ అంటూ హంగామా చేయడం తప్ప, మట్టిని కాపాడటం అనేది జరిగే పనేనా.? ఛాన్సే లేదు.!
‘నువ్వు తిన్న మట్టేరా.. నిన్ను తిన్నదీ..’ అంటాడో సినీ కవి. నువ్వు నాశనం చేసిన మట్టేరా, నిన్ను నాశనం చేస్తున్నదీ.. అని కొత్తగా మనం రాసుకోవాలేమో.!
డాన్సులేసి.. వెకిలి చేష్టలు చేసి.. మట్టిని రక్షించేద్దామా.?
సేవ్ సాయిల్.. మట్టిని రక్షించండంటూ డీజేల మాటున డాన్సులేస్తే సరిపోదు.. సెలబ్రిటీలతో హంగామా చేస్తే అసలే సరిపోదు. మట్టి మీద మమకారం పెంచుకోవాలి.
మనం ఏం తింటున్నాం.? ఎలాంటి మట్టిలో పంటలు పండుతున్నాయ్.? ఆ మట్టిని ఎలా నాశనం చేస్తున్నాం.? అన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోవాలి.
నిజానికి, అలా ఆత్మ విమర్శ చేసుకునేందుకూ సమయం లేదు. మట్టి నాశనమైపోయింది.. మనిషీ నాశనమైపోతున్నాడు.! ఈ విషయంలో మాత్రం తగ్గేదే లే.!