Nannaku Prematho Happy Fathers Day.. నాన్న.! అసలు నాన్నంటే ఎవరు.?. నాన్నంటే నమ్మకాన్నిచ్చేవాడు.! నాన్నంటే ధైర్యాన్నిచ్చేవాడు.!
అమ్మ గురించి ఎన్నో సినిమాలు.. ఎన్నెన్నో పాటలు. కానీ, ఈ విషయంలో నాన్నకు కొంత అన్యాయమే జరిగిందని చెప్పాలి సినిమాల పరంగా. నాన్న మీద సినిమాలు రాలేదని కాదు.. పాటలు రాలేదనీ కాదు.!
అమ్మ, నాన్న వేర్వేరు కాదు. అమ్మ, నాన్న.. ఇద్దరూ సమానమే. ఇద్దరూ నమ్మకమే.. ఇద్దరూ ధైర్యమే.. ఇద్దరూ సర్వస్వమే.!
ఏడాదికోసారి ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అనేసుకుంటే సరిపోతుందా.? నిజానికి, ఇది మన కల్చర్ కానే కాదు. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ.. అతిధి దేవోభవ.. అని చెబుతుంది మన సంస్కృతి.
కానీ, అవన్నీ ఎప్పుడో మర్చిపోయాం. అమ్మని గౌరవించాలన్న విషయాన్ని మర్చిపోయాం. నాన్న త్యాగాల్ని గుర్తించలేకపోతున్నాం. గురువు సంగతి సరే సరి. అతిథుల విషయంలో ఇంకో పైత్యం.
Nannaku Prematho Happy Fathers Day.. నాన్నంటే…!
హ్యాపీ ఫాదర్స్ డే.! నాన్న గురించే ప్రస్తుతానికి మాట్లాడుకుందాం. నాన్నంటే భరోసా. నాన్నంటే నమ్మకం. నాన్నే ఎవరికైనా మొట్టమొదటి హీరో.!

ఔను మా నాన్న పోటుగాడే.! ప్రతి కొడుకూ, తన తండ్రి గురించి ఇలాగే అనుకుంటాడు.. అనుకోవాలి కూడా.
నాన్న పడే కష్టం, నాన్న పంచే ప్రేమ, నాన్న మోసే బాధ్యత.. ఇవన్నీ కొడుక్కైనా, కూతురికైనా చచ్చేంతవరకు గుర్తుండాల్సిన విషయాలే.
Also Read: ‘ఆమె’కి వందనం.! మగువా.. నువ్వే ఈ జగమంతా.!
ఏడాదంతా మర్చిపోయి, ఏడాదిలో ఒక్కరోజు, ‘హ్యాపీ ఫాదర్స్ డే..’ అంటూ వాట్సాప్ స్టేటస్ లేదా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు ‘నాన్న’ని పరిమితం చేసేసిన రోజులివి.
అయినాగానీ, కల్మషం లేని నాన్నలందరికీ.. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే క్రమంలో తమ జీవితాన్ని ధారపోసిన నాన్నలందరికీ.. హ్యాపీ ఫాదర్స్ డే.! నాన్నకు ప్రేమతో.!
చివరగా.. ‘నాన్న’ అంటే, కొన్ని అక్షరాలు కాదు.. వందల వేల పదాలు కాదు, లక్షలు, కోట్ల పదాలు కూడా సరిపోవు ‘నాన్న’ గురించి చెప్పడానికి. నాన్న అంటే ఓ అనుభూతి.
నాన్న త్యాగం ముందు ఎవరెస్టు శిఖరం చిన్నబోతుంది.. నాన్న ఒక ఎమోషన్.! నాన్న ఒక నిజం.! ‘నాన్న’కు సాటి రాగలదేదీ ఈ భూమ్మీద, ఈ అనంత విశ్వంలో ఇంకోటి లేదు.
అందుకే, మళ్ళీ ఇంకోసారి.. ‘నాన్నకు ప్రేమతో’.! మళ్ళీ మళ్ళీ మరోసారి ‘నాన్నకు ప్రేమతో’.!
– yeSBee