Malaika Arjun Love బాలీవుడ్ నటి మలైకా అరోరా, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్.. జంటగా ప్యారిస్ చెక్కేశారు. చిక్కేశారనాలా.? వెళ్ళారనాలా.?
ఎవరైనా ఎలాగైనా అనుకోండి, ఈ ప్రేమపక్షులు.. అందమైన ప్యారిస్‌లో ‘సెలబ్రేషన్’ కోసం విమానమెక్కేశారు. అదీ అసలు విషయం.
‘తల్లీ, కొడుకూ.. ముచ్చటగా వున్నారు..’ అంటూ మలైక, అర్జున్ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇది కొత్తగా జరుగుతున్న వ్యవహారమేమీ కాదు.
Malaika Arjun Love.. ఈ ప్రేమ ఎంత మధురం.?
ఔను, మలైకా అరోరాకి గతంలోనే పెళ్ళయ్యింది.. పిల్లలున్నారు. భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

ఆగండాగండీ.. సోలో లైఫ్ కాదు, సహజీవనం చేస్తోంది.. అదీ అర్జున్ కపూర్‌తో. ఇక్కడే వచ్చింది చిక్కు. అర్జున్ కపూర్ స్టిల్ బ్యాచిలర్.! పైగా, చిన్న కుర్రాడు.. మలైకా అరోరా (Malaika Arora) వయసుతో పోల్చితే.
అయినా, ప్రేమకు వయసుతో సంబంధమేంటి.? సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కంటే ఆయన భార్య అంజలి పెద్దది వయసులో. ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనాస్ కంటే చాలా పెద్దది. చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయ్.!
ట్రోలింగ్ ఎంత కఠినం.!
పెళ్ళయి పిల్లలు వుండటమొక్కటే మలైకా విషయంలో, అర్జున్ కపూర్ మీద ట్రోలింగ్ జరగడానికి కారణమా.? అంటే, అది కూడా ఓ కారణమై వుండొచ్చంతే.
అయినా, మలైకా – అర్జున్ బాగానే వున్నారు కదా.? వాళ్ళిద్దరికీ లేని అభ్యంతరం, మిగతావాళ్ళకెందుకు.? ఏమో, ఎవరి గోల వారిదే.
Also Read: పూజా హెగ్దేకి ‘బీస్ట్’ షాక్.! ఔనా.? అలా చేసిందా.?
అర్జున్ కపూర్ (Arjun Kapoor) పుట్టినరోజు నేపథ్యంలో సెలబ్రేషన్స్ కోసం ఈ ప్రేమ జంట (Malakarjun), ప్యారిస్ పయనమైంది. అదీ అసలు సంగతి.
సహజీవనం నేరం కానప్పుడు, మలైకా అరోరా – అర్జున్ కపూర్ కావొచ్చు, ఇంకే జంట అయినా కావొచ్చు.. సహజీవన విహారంలో మునిగి తేలితే తప్పేంటట.?