ఆ తప్పు చేయనంటున్న LIGER Charmy Kaur.. ఎందుకలా.?

 ఆ తప్పు చేయనంటున్న LIGER Charmy Kaur.. ఎందుకలా.?

Charmy Kaur Slams Wedding Rumors

ఒకప్పటి హీరోయిన్.. ఇప్పుడు నిర్మాత అయిన ఛార్మి కౌర్ (LIGER Charmy Kaur Slams Wedding Rumors), త్వరలో పెళ్ళి చేసుకోబోతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెళ్ళి వయసు ఎప్పుడో వచ్చేసింది ఛార్మికి. కానీ, కెరీర్ మీద ఫోకస్ ఎక్కువవడంతో పెళ్ళి గురించిన ఆలోచన పక్కన పెట్టేసిన ఛార్మి, ఈ మధ్యనే పెళ్ళి గురించి ఆలోచిస్తోందన్నది ఆ పుకార్ల సారాంశం.

కుటుంబ సభ్యులు ఓ సంబంధం చూశారనీ, ఆ కుర్రాడు ఛార్మికి బంధువే అవుతాడనీ వార్తలొచ్చాయి. అయితే, ఈ విషయమై ఛార్మి సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చింది. తన పెళ్ళి గురించిన జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టి పారేసింది ఈ అందాల భామ.

‘అవన్నీ పుకార్లే..’ అని ఊరికినే కొట్టి పారేస్తే, ఆమె ఛార్మి ఎందుకవుతుంది.? అసలామెకు పెళ్ళి చేసుకునే ఆలోచనే లేదట. లేకపోతే పాయె.. అసలు ఆ తప్పు తాను చెయ్యబోనని చెప్పడమేంటి.? పెళ్ళి చేసుకోవడమంటే తప్పు చేసేసినట్లేనా.? ఏమో, ఛార్మికి పెళ్ళి విషయంలో అంత తప్పు ఎలా కనిపించిందో ఏమో.

ఛార్మి కెరీర్ విషయానికొస్తే, ఇప్పుడామె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లైగర్’ సినిమాని నిర్మిస్తోంది. పూరి – ఛార్మి (LIGER Charmy Kaur Slams Wedding Rumors) సంయుక్తంగా ‘పూరి కనెక్ట్స్’ అనే నిర్మాణ సంస్థను నిర్వహిస్తోన్న విషయం విదితమే. ఈ సంస్థ ద్వారానే ‘కొత్త టాలెంట్’ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు పూరి జగన్నాథ్ ఛార్మి.

అన్నట్టు, ‘లైగర్’ (LIGER) సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరో.

Digiqole Ad

Related post