Dil Raju Son.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రయ్యారు. ఇప్పుడు కొత్తగా తండ్రి అవడమేంటి.? ఆల్రెడీ ఆయనకు హన్షితా రెడ్డి అనే కుమార్తె వుంది కదా.? ఆమెకు కూడా ఆ మధ్య పెళ్ళయ్యింది కదా.?
ఔను, దిల్ రాజుకి చాలాకాలం క్రితమే పెళ్ళయ్యింది. భార్య అనిత అనారోగ్యంతో కొన్నాళ్ళ క్రితం మృతి చెందారు.
దిల్ రాజు – అనితల దాంపత్య జీవితానికి గుర్తుగా హన్సితా రెడ్డి జన్మించారు. ఆమెకూ కొన్నాళ్ళ క్రితం పెళ్ళయ్యింది.
అయితే, మొదటి భార్య అనిత మరణానంతరం దిల్ రాజు, రెండో పెళ్ళి చేసుకున్నారు. వరంగల్‌కి చెందిన తేజస్విని (వ్యాఘా రెడ్డి)తో దిల్ రాజు వివాహం కోవిడ్ లాక్ డౌన్ సమయంలో జరిగింది.
Dil Raju Son.. వారసుడొచ్చాడు..
తాజాగా తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనించ్చారు. దాంతో, దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడు.. అంటూ పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అదే సమయంలో, దిల్ రాజు మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దిల్ రాజు మొన్నామధ్య ‘తాత’ అయ్యారు. ఇప్పుడేమో తండ్రి అయ్యారు. మామూలుగా అయితే, తండ్రి అయ్యాక.. కొన్నాళ్ళకు తాత అవుతారు.
కానీ, దిల్ రాజు తండ్రి అయ్యాక తాత అయ్యారన్నది జరుగుతోన్న ట్రోలింగ్ సారాంశం. సెలబ్రిటీలు గనుక, ఈ తరహా ట్రోలింగ్ తప్పదు. నిజానికి, బయటి సమాజంలో కూడా ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి.
పాన్ ఇండియా ప్రొడ్యూసర్..
ఈ తరహా ట్రోలింగ్‌ని దిల్ రాజు పట్టించుకునే పరిస్థితి లేదనుకోండి.. అది వేరే సంగతి. ప్రస్తుతం వరుస సినిమాలు నిర్మిస్తూ, దిల్ రాజు చాలా బిజీగా వున్నారు.
వాటిల్లో, రెండు భారీ ప్రాజెక్టులున్నాయి.. అవి రెండూ బై లింగ్వల్ ఫిలింస్.. అదే సమయంలో పాన్ ఇండియా సినిమాలు కూడా.
Also Read: సంయుక్త మీనన్‌కి మరో బంపర్ ఆఫర్.!
రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ఇంకోటి వంశీ పైడిపల్లి – విజయ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తోన్న సినిమాకి తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ ఖరారైన విషయం విదితమే. ఆ సినిమా నిర్మాణంలో వుండగానే, దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడన్నమాట.