Aadikeshava Panja Vaishnav Tej.. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులేయించుకున్నాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత కూడా ఓ ప్రయోగాత్మక సినిమానే చేశాడు.
‘ఉప్పెన’, ‘కొండ పొలం’, ఆ తర్వాత ‘రంగ రంగ వైభవంగా’.. ఇప్పుడేమో, ‘ఆదికేశవ’.! లైనప్ అదిరింది కదా.! ప్లానింగ్ కెవ్వు కేక.!
ఈసారి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్‌ని ఎంచుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించింది ‘ఆదికేశవ’ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన.
Aadikeshava Panja Vaishnav Tej.. డాన్సుల్లో అదరగొట్టేశాడు..
తాజాగా ఈ సినిమా నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే ఓ లిరికల్ సింగ్‌ని విడుదల చేశారు. శ్రీలీల మంచి డాన్సర్.. ఆ విషయం కొత్తగా చెప్పాలా.?
డాన్సుల్లో ఇంతవరకు తన స్టామినాని పూర్తిగా చూపించే అవకాశం పంజా వైష్ణవ్ తేజ్‌కి దక్కలేదు. మెగా మేనల్లుడు కదా, డాన్సుల్లో ఆ మెగా స్పార్క్ వుండే వుంటుంది.
‘ఆదికేశవ’ సినిమాలో ఆ స్పార్క్ చూపిస్తున్నట్టున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ‘ఆదికేశవ’ లిరికల్ సాంగ్‌లో పంజా వైష్ణవ్ తేజ్ డాన్సులకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
శ్రీలీలతో పోటీగా డాన్సుల్లో మెప్పించినట్టున్నాడు వైష్ణవ్. ‘ఆదికేశవ’ నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: పవన్ కళ్యాణ్ ఎక్కడ.? ఇదిగో ఇక్కడ.!
సో, థియేటర్లలో మాస్ ఆడియన్స్‌ని తన మాస్ స్టెప్స్‌తో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) మెప్పించనున్నాడన్నమాట.!