ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు (Aamir Khan Kiran Rao Divorced) విడాకులు తీసుకున్నారు. పదిహేనేళ్ళ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ఇరువురూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భార్యాభర్తల్లా కలిసుండలేక విడిపోతున్నారట. కానీ, తనయుడు ఆజాద్ కోసం తల్లిదండ్రుల్లా ‘అవసరమైనప్పుడు’ కలిసే వుంటారట.
ఇంకా చిత్రమైన విషయమేంటంటే, సినిమాల కోసం కలిసి పనిచేస్తారట.. పానీ ఫౌండేషన్ కోసం కూడా కలిసే వుంటారట. ఇతర ప్రాజెక్టుల కోసం కూడా ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కలిసే పని చేయబోతున్నారట. ఇకపై తాము విడిగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Also Read: నయా ట్రెండ్: విడాకులూ బ్రేకప్పూ వాట్సప్పూ.?
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) మొదటి భార్య రీనా దత్తా (Reena Dutta). ఆమిర్ – రీనా దంపతులు 2002లో విడిపోయారు. ఆ తర్వాత కిరణ్ రావుని ఆమిర్ ఖాన్ పెళ్ళాడిన సంగతి తెలిసిందే. కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ నటించిన ‘లగాన్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావడం గమనార్హం.
Also Read: Bold Talk డేటింగుల్లోనూ పొట్టీ.. పొడుగూ.!
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందించిన ‘దోబీ ఘాట్’ సినిమాకి కిరణ్ రావు (Kiran Rao) దర్శకత్వం వహించారు కూడా. అన్యోన్య దాంపత్యం.. అని ఈ జంట గురించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో అందరూ చెప్పుకుంటుంటారు. కానీ, ఏమయ్యిందో.. ఈ ఇద్దరి వైవాహిక బంధం విడాకులతో (Aamir Khan Kiran Rao Divorced) ముగిసింది.