Aamir Khan Kiran Rao.. ‘నీ జిమ్మడ.. పచ్చని సంసారంలో నిప్పులు పోశావ్. నువ్వు మాత్రం విడాకులిచ్చేసిన నీ మాజీ పెళ్లాంతో చెట్టా పట్టాలేసుకు తిరుగుతున్నావ్..’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖానుడిని ఆడి పోసుకుంటున్నారు.
ఆమిర్ ఖాన్ (Aamir Khan) అంటే మిస్టర్ పర్‌ఫెక్షనిస్టు. సినిమా కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. ఎంత కష్టమైనా పడతాడు.
నటన ఒక్కటే కాదు, కథ, కథనం, మాటలు, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్ని విషయాల్లోనూ పక్కాగా వుండాలనుకుంటాడు. అందుకే మిస్టర్ పర్‌ఫెక్షనిస్టు అని పిలుస్తారాయన్ని.
Aamir Khan Kiran Rao.. నిజమేనా.? మిస్టర్ పెర్‌ఫెక్షనిస్టేనా.?
సినిమా సంగతి పక్కన పెడితే, ఆమిర్ ఖాన్ నిజ జీవితంలోనూ.. అదేనండీ వ్యక్తిగత జీవితంలోనూ మిస్టర్ పర్‌ఫెక్షనిస్టేనా.? ఆ ఒక్కటీ అడక్కూడదు.
పెళ్లి.. మళ్లీ పెళ్లి, విడాకులు.. మళ్లీ విడాకులు, ఎఫైర్, మళ్లీ ఎఫైర్, మళ్లీ మళ్లీ ఎఫైర్.. ఇలా నడుస్తోంది ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం.

కొన్నాళ్ల క్రితమే కిరణ్ రావుకి విడాకులిచ్చేసిన ఈ ఆమిర్ ఖానుడు తాజాగా ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) 50 వ పుట్టినరోజు వేడుకల్లో సందడి చేశాడు.
అదీ తన మాజీ భార్య కిరణ్ రావుతో (Kiran Rao) చెట్టా పట్టాలేసుకుని మరీ. అంతే.! ఎవరికో.. ఎక్కడ కాలాలో అక్కడే కాలింది.
ఏంటీ శాపనార్థాలు.? ఎందుకోసం.?
పైన ప్రస్థావించిన ‘నీ జిమ్మడ..’ అంటూ ఆమిర్ ఖాన్ మీద తిట్లు, శాపనార్ధాలతో విరుచుకుపడుతోంది నెటిజనం. ఎవరా నెటిజనం.?
ఇంకెవరు.. అక్కినేని నాగచైతన్య, సమంత.. ఈ ఇద్దర్నీ అభిమానించే అభిమాన గణం. బోడి గుండుకీ, మోకాలికీ లింకేంటీ.? అనే కదా మీ డౌటు.
Also Read: కార్పొ‘రేటు’ కథ.. కూతుర్ని చెల్లెలిగా ఏమార్చి ప్రాణం తీసింది.!
సమంత, నాగ చైతన్య మధ్య చిచ్చు పెట్టిందే ఆమిర్ ఖానుడు.. అని ఓ బలమైన ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది మరి. అదండీ అసలు సంగతి.