అవసరమైతే బిగ్‌బాస్‌నైనా ఎదిరిస్తా.. ‘మోనాల్ – అఖిల్’తో ఆ ముచ్చటే వద్దని తేల్చేశాడు అబిజీత్. మోనాల్ గజ్జర్ విషయంలో ప్రతిసారీ తనకు ‘రాడ్డు’ పడిపోతోందని అబిజీత్ (Abijeet Says Big No To Bigg Boss) ఆవేదన వ్యక్తం చేశాడంటే, అతని సిన్సియారిటీ ఏంటన్నది సుస్పష్టమైపోతోంది.
అఖిల్, ప్రతిసారీ మోనాల్ గజ్జర్ టాపిక్ తీసుకొచ్చి, అబిజీత్‌ని కెలుకుతుంటాడు..
ఆ విషయంలో నానా రాద్ధాంతం జరుగుతుంటుంది.. చివరికి మోనాల్ (Monal Gajjar), కన్నీళ్ళు పెట్టేస్తూ ‘మీ ఇద్దరూ ఒక్కటే..’ అనేస్తుంటుంది. మిగతా విషయాలెలా వున్నా, మోనాల్ ‘ఓవర్ యాక్టింగ్’ అస్సలేమాత్రం నచ్చడంలేదు అబిజీత్‌కి (Abijeet). మొదట్లోనే మోనాల్ వ్యూహాల్ని పసిగట్టాడో ఏమో, ఆమెకు దూరంగా వుంటూ వచ్చాడు అబిజీత్ చాన్నాళ్ళ నుంచీ.
కాస్త కనెక్ట్ అయ్యిందనుకునేలోపు మళ్ళీ, రియల్ కలర్స్ బయటపెట్టింది మోనాల్ గజ్జర్ (Monal Gajjar). ఆమెకి బిగ్ హౌస్‌లో (Bigg Boss Telugu 4) బిగ్‌బాస్ ఒకటే టాస్క్ అప్పగించినట్లుంది పరిస్థితి. అఖిల్ (Akhil Sarthak) సంగతి కూడా అంతే. తాజాగా, దెయ్యాల టాస్క్ సందర్భంగా గ్రేవ్ యార్డ్ (స్మశానం)లో అబిజీత్ (Abijeet)- అఖిల్‌ల మధ్య క్విజ్ జరుగుతుందట.. అదీ మోనాల్‌తో ఎవరు డేట్‌కి వెళ్ళాలనే విషయమ్మీదనట.
దీనికి బిగ్‌బాస్ (Bigg Boss 4 Telugu) చెప్పిన కారణం, ‘ఇన్నాళ్ళూ మోనాల్‌ని ఏడిపించిన అబిజీత్ (Team Abijeet), అఖిల్.. ఆమెను డేట్‌కి తీసుకెళ్ళడానికి పోటీ పడాలి..’ అని. ‘నేను ఏడిపించడమేంటి.? టాస్క్ చేస్తే, నేను ఆమెని ఏడిపించానని ఒప్పుకున్నట్లే కదా..’ అంటూ అబిజీత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
హారిక (Alekhya Harika), అతన్ని ఓదార్చింది. జస్ట్ అది టాస్క్ మాత్రమే.. అని కొందరు చెప్పేందుకు ప్రయత్నించినా, అబిజీత్ జీర్ణించుకోలేకపోయాడు. ఓ దశలో కంటతడి కూడా పెట్టేశాడు. ‘ఎందుకు ఏడుస్తున్నాడు.?’ అంటూ అఖిల్ వెటకారంగా ప్రశ్నించాడు. నిజమే మరి, ఆ బాధేంటో అబిజీత్‌కి (We Admire Abijeet) మాత్రమే తెలుసు.
ఏ విషయమ్మీద అయినా అబిజీత్ ఫుల్ క్లారిటీతో వుంటాడు. ఇప్పటిదాకా ఏ ఎపిసోడ్‌లోనూ అబిజీత్ కళ్ళల్లో నీళ్ళు తిరగలేదు. జస్ట్ అది ఒక టాస్క్ మాత్రమే అనుకుని చేసెయ్యకుండా, తన క్యారెక్టర్‌ని నిలబెట్టుకునేందుకు మానసిక క్షోభ అనుభవించాడు. దటీజ్ అబిజీత్ (Abijeet Says Big No To Bigg Boss). అందుకే, అతనికి అనూహ్యంగా అభిమానులు పెరుగుతున్నారు.