బిగ్‌బాస్ అనేది జస్ట్ ఓ రియాల్టీ షో. ‘బస్తీ మే సవాల్..’ అంటూ ఎవరన్నా ఇంకొకరికి సవాల్ విసిరితే (Abijeet Vs Syed Sohel) అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రెండో సీజన్‌లో కౌశల్ వర్సెస్ తనీష్.. ఓ బిగ్ ఫైట్ జరిగింది. షో ముగిశాక ఎవరి దారి వారిదే అయ్యింది.
తాజాగా అబిజీత్ వర్సెస్ సోహెల్.. ఓ స్ట్రాంగ్ అండ్ అన్ వాంటెడ్ డిస్కషన్ జరిగింది. అది మాటల యుద్ధానికి తెరలేపింది. ‘ఎవరిది మగతనం.?’ అన్న దిశగా చర్చ జరిగింది. ‘అమ్మాయిల్ని అడ్డం పెట్టుకుని ఆటలాడేటోడివి.. నువ్వు ఫిజికల్ గేవ్స్‌ు ఎలా ఆడతావ్.?’ అని ప్రశ్నించేశాడు సోహెల్.
కానీ, అంతకు ముందు టాస్క్‌లో అఖిల్ ముందు సోహెల్ తేలిపోయాడు.. చివరికి అఖిల్ దగ్గరున్న సూట్‌కేస్ నుంచి డబ్బులు దొంగిలించాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ బిగ్‌బాస్‌లో చాలా సర్వసాధారణం. అయితే, అబిజీత్ కరెక్ట్‌గా ఆడేస్తున్నాడని కూడా చెప్పలేం. ‘ఫిజికల్‌గా వద్దు..’ అని చెప్పిన అబిజీత్, తన రోబో బృందంలోని మహిళల్ని పురమాయించి, దివి (హ్యామన్స్ బృందం) కిడ్నాప్‌కి వ్యూహరచన చేశాడు.
ఫిజికల్‌గానే దివి మీద ఎటాక్ జరిగింది. హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగ్, ఈ విషయంలో అబిజీత్‌కి చీవాట్లు పెట్టి వుండాల్సింది. ఎందుకంటే, అరియానా గ్లోరీ ఇచ్చిన ఐడియాని అస్సలు లెక్కచేయలేదు అబిజీత్. తన బృందంలోని మహిళా కంటెస్టెంట్‌కి కనీసం రెస్పెక్ట్ ఇవ్వని అబిజీత్, బిగ్‌బాస్ వ్యూయర్స్ దృష్టిలో చాలా పలచనైపోయాడు. బిగ్‌బాస్‌లో ఇలాంటివి చాలానే జరుగుతుంటాయి.
సందర్భానుసారం జరిగే విషయాలు, అందులో కొంత పార్ట్ మాత్రమే టెలికాస్ట్ అవడం.. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. హౌస్ నుంచి బయటకొచ్చాక, ‘లోపట ఏం జరిగిందో మాకు మాత్రమే తెలుసు.. టీఆర్పీ కోసం వాళ్ళు ఏం చూపించాలనుకుంటారో అదే చూపిస్తారు..’ అని సాక్షాత్తూ కంటెస్టెంట్స్ చెప్పినా, బిగ్‌బాస్ వ్యూయర్స్ మాత్రం తమకు తోచిన రీతిలో అనాలసిస్ చేసేస్తుంటారు.
ఇక్కడ ‘మగతనం’ చర్చ కూడా అలాంటిదే. మగతనం చూపించడానికైతే బిగ్‌హౌస్‌కి వెళ్ళలేదు కదా ఏ మేల్ కంటెస్టెంట్ కూడా.! ఇలాంటివి వీలైనంతవరకు బిగ్‌బాస్ మ్యూట్ చేసేస్తే మంచిది. వీకెండ్‌లో నాగ్ ఇలాంటి విషయాలపై క్లాస్ పీకినా ఉపయోగముండదు.. జస్ట్ అదీ ఓ పబ్లిసిటీ స్టంట్‌గా మిగిలిపోతుందంతే.