బిగ్‌బాస్ తెలుగు సీజన్ ఫోర్‌లో అబిజీత్ స్మార్ట్ (Abijeet Smart Play BB4) కంటెస్టెంట్‌గా తన ఉనికిని చాటుకుంటున్న సంగతి తెలిసిందే. హ్యామన్స్ – రోబోట్స్ టాస్క్‌లో అబిజీత్ స్మార్ట్ ప్లే వర్కవుట్ అయ్యింది. దాన్ని కన్నింగ్.. అని అంతా అభివర్ణించినా, బిగ్ హోస్ట్ నాగార్జున మాత్రం, అబిజీత్‌ని ‘మహానాయకుడు’గా అభివర్ణించిన సంగతి తెల్సిందే.
అదే స్మార్ట్ ప్లే ఇంకోసారి ప్రదర్శించాడు అబిజీత్. ‘బిగ్‌బాస్ స్టార్ హోటల్’ టాస్క్‌లో అబిజీత్, అతిథులనుంచి తెలివిగా స్టార్స్‌ని కొట్టేశాడు. అయితే, అతిథుల్ని ఇంప్రెస్ చేయడంలో మాత్రం హోటల్ సిబ్బంది విఫలమయ్యారు.
అతిథులు కూడా, ఎట్టిపరిస్థితుల్లోనూ సిబ్బంది సేవలకు ఇంప్రెస్ అవకూడదనే నిర్ణయించుకున్నారు. మరోపక్క, అబిజీత్ పట్ల కొంచెం సాఫ్ట్‌గా మూవ్ అవుతోన్న హారిక, అతిథుల బృంద సభ్యురాలైనప్పటికీ.. అబిజీత్ స్మార్ట్ ట్రాప్‌లో పడిపోయింది.
అతిథుల బృందంలోని మెహబూబ్, సోహెల్ తదితరులు వద్దంటున్నా ఓ స్టార్ ఇచ్చేయడానికి సిద్ధపడింది హారిక. ఆ ఒక్క అవకాశాన్ని వాడుకుని, అబిజీత్.. మొత్తం స్టార్స్ తాము సంపాదించామంటూ కలరింగ్ ఇచ్చేశాడు.
దాంతో హారిక, పలుమార్లు బిగ్‌బాస్‌కి కెమెరాల ద్వారా మేటర్‌ని కన్వే చేయడానికి ప్రయత్నించింది.. చివరకు ఏడ్చింది కూడా. బిగ్‌బాస్ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోపక్క, అతిథుల బృందంలోని మెహబూబ్, హోటల్ అసిస్టెంట్ మేనేజర్ అవినాష్ మీద అరిచేశాడు.
‘పుచ్చెలు పగిలిపోతాయ్’ అంటూ మెహబూబ్ సంయమనం కోల్పోయాడు. ఆ తర్వాత వరుసగా అందరి దగ్గరకూ వెళ్ళి సారీ చెప్పాల్సి వచ్చింది మెహబూబ్‌కి. ఇంకోపక్క, అతిథుల బృందం.. కష్టమైన టాస్క్‌లను హోటల్ సిబ్బందికి ఇచ్చారు. అబిజీత్, అఖిల్ సార్థక్, అమ్మ రాజశేఖర్.. ఫిజకల్ టాస్క్‌లతో చాలా ఇబ్బందిపడ్డారు.
నోయెల్ కొంచెం తెలివిగా అతిథులకు సేవలు చేసి, టిప్పులు బాగానే పొందాడు. దివి స్పా నడుపుతూ తన పని తాను చేసుకుపోయింది. ఈ ఎపిసోడ్‌లో అఖిల్‌తో మోనాల్ గజ్జర్ మళ్ళీ ‘కమ్యూనికేషన్’ పెంచుకునేందుకు ప్రయత్నించింది. అఖిల్, ఆమెని అవాయిడ్ చేయలేదుగానీ.. ఎందుకో కొంచెం రిజర్వ్‌డ్‌గా వుండేందుకు ప్రయత్నించాడు. బహుశా నామినేషన్స్ సందర్భంగా జరిగిన రగడతో కాస్త జాగ్రత్తపడినట్లున్నాడు.