అల్లు అర్జున్‌ని ఎందుకు ట్రోల్ చెయ్యకూడదు ఆదీ.?
Hyper Adi Allu Arjun
Trolling Against Allu Arjun.. సినీ నటుడు ‘హైపర్’ ఆది, మరో సినీ నటుడు అల్లు అర్జున్‌ని ట్రోల్ చేయొద్దంటూ సెలవిచ్చాడు.
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ని ట్రోల్ చేయడం సబబు కాదన్నది ‘హైపర్’ ఆది ఉవాచ.
నిజానికి, ఏ నటుడ్నీ ట్రోల్ చేయడం సబబు కాదు.! అయినా, ఎవర్నయినా ఎందుకు ట్రోల్ చేయాలి.? ఇది కదా అసలు విషయం.!
Trolling Against Allu Arjun ట్రోలింగ్ చేస్తే ఏమొస్తుంది.?
అసలు ట్రోల్ చేసేది ఎవరు.? ఎందుకు.? ట్రోల్ చేయడం వల్ల మామూలుగా అయితే ఎవరికైనా ఏమొస్తుంది.? ప్చ్.. ఏమీ రాదు, శునకానందం తప్ప.!
కాకపోతే, ఇలా ట్రోల్ చేసినందుకుగాను కొంతమందికి పేమెంట్లు వెళుతున్నాయ్.. ఎవరి నుంచి.? అంటే, పీఆర్ టీమ్స్ నుంచి. ఇదైతే నిజం.!

గత కొంతకాలంగా ఈ ట్రెండ్ నడుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు.. ఇలా ప్రముఖులైతే చాలు, ఎవర్నయినా ట్రోల్ చేసి పారేస్తున్నారు.
ట్రోలింగ్.. ఓ ట్రెండింగ్ బిజినెస్.!
‘ట్రోలింగ్’ అనేదాన్ని ఓ బిజినెస్‌గా కూడా కొంతమంది మార్చేశారు. అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో ఇలాంటి కొందరు, మెగా హీరోల్ని ట్రోల్ చేయడం చూస్తున్నాం. దానికి కౌంటర్ ఎటాక్ వస్తోంది.. అదీ అల్లు అర్జున్ మీద.
అభిమానుల్ని అల్లు అర్జున్ గనుక కంట్రోల్‌లో పెట్టుకోగలిగితే.. చాలావరకు డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది.! కానీ, అల్లు అర్జున్ ఎందుకలా చేయలేకపోతున్నాడన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
Mudra369
హైపర్ ఆది చెబితే అల్లు అర్జున్ మీద ఎవరూ ట్రోలింగ్ ఆపెయ్యరు. ట్రోలింగ్ ఆపమని చెప్పాల్సింది అల్లు అర్జున్.. అదీ, తన అభిమానులకి.!
మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి సహా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తదితరులు ఇప్పటికే పలు సందర్భాల్లో అభిమానులకు విజ్ఞప్తి చేయడం చూశాం.
అల్లు అర్జున్ చుట్టూనే ఎందుకు.?
టాలీవుడ్‌లో కేవలం అల్లు అర్జున్ చుట్టూనే, ‘పీఆర్ మాఫియా’ అనే ఆరోపణలు వస్తున్నాయి ఈ ట్రోలింగ్‌కి సంబంధించి. అదెందుకు జరుగుతోంది.? అన్నదే కీలకం ఇక్కడ.
Also Read: పోయేకాలం: ముసలాడేగానీ.. ‘మగా’నుభావుడు.!
అల్లు అర్జున్ ఈ ట్రోలింగ్‌ని సమర్థిస్తాడని అనుకోలేం. కానీ, ఈ ట్రోలింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మాత్రం అల్లు అర్జున్ మీదనే వుంది.!
చివరగా.. ట్రోలింగ్ వల్ల ఆయా ప్రముఖుల స్థాయి తగ్గిపోదు. కొన్ని సందర్భాల్లో, ట్రోలింగ్ చేసేవారే కటకటాల్లెక్కెట్టాల్సి వస్తుంది. సభ్య సమాజానికి ట్రోలింగ్ అత్యంత హానికరం.!