‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన డింపుల్ బ్యూటీ ఆదా శర్మ మల్టీ టాలెంటెడ్. హీరోయిన్‌గా ఆశించిన స్థాయి సక్సెస్ ఇంకా అందుకోలేదుగానీ, పలు భాషల్లో సినిమాలు మాత్రం చేసేసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుందన్న సంగతి (Adah Sharma Rowdy Baby) అందరికీ తెలిసిందే.
తాజాగా కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో కలిసి ‘రౌడీ బేబీ’ సాంగ్‌కి డాన్స్ చేసింది ఆదా శర్మ (Adah Sharma). ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ధనుష్ (Dhanush), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా రూపొందిన ‘మారి-2’ (Maari2) సినిమాలోని ‘రౌడీ బేబీ’ (Rowdy Baby) సాంగ్ ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే.
యూ ట్యూబ్‌లో ఇప్పటికీ ఈ సాంగ్ సరికొత్త సంచనాలు సృష్టిస్తూనే వుంది. రికార్డుల మీద రికార్డులు తిరగరాసేస్తోంది. ధనుష్ మంచి డాన్సర్.. సాయి పల్లవి డాన్సింగ్ టాలెంట్ కూడా అందరికీ తెలుసు. ఈ ఇద్దరూ ‘రౌడీ బేబీ’ పాటతో బీభత్సమైన మ్యాజిక్ చేసేశారు.
సాధారణంగా ఇలాంటి ‘క్లాసిక్స్’ని టచ్ చేయడం అంటే చాలా పెద్ద రిస్క్. కానీ, ఆదా శర్మ – మెల్విన్ లూయిస్.. ‘రౌడీ బేబీ’ ఒరిజినల్ ఫ్లేవర్‌ని చెడగొట్టకుండా, అత్యద్భుతంగా డాన్స్ చేశారు. ట్రెడిషనల్ వేర్‌లోనూ, వెస్ట్రన్ వేర్‌లోనూ మెల్విన్ – ఆదా దుమ్ము రేపేశారు.
ఆదా శర్మ (Adah Sharma Hot) మంచి డాన్సర్ అని చాలామందికి ఈ పాటతో తెలుస్తోంది. యోగాసనాలు వేయడంలో ఆదా శర్మ దిట్ట. విల్లులా తన శరీరాన్ని వంచేస్తుంది. అలాగని, అలా విల్లులా ఒళ్ళు వంచేసేవారంతా అత్యద్భుతంగా డాన్స్ వేసేయగలరని చెప్పలేం.
డాన్స్ అనేది ఓ ఆర్ట్. దానికి ‘స్ప్రింగ్’ లాంటి ఫిజిక్ అదనపు ఆకర్షణ. అన్నిటికీ మించి ఎక్స్‌ప్రెషన్స్ అనేవి డాన్స్‌కి కొత్త గ్లామర్‌ని తీసుకొస్తాయి. ఏదిఏమైనా ‘రౌడీ బేబీ’ సాంగ్‌తో ఆదా శర్మ చాలా క్యూట్‌గా ‘హార్ట్ ఎటాక్’ తెప్పించేస్తోందని ఈ వీడియో చూశాక నిస్సందేహంగా చెప్పొచ్చు.
‘రౌడీ బేబీ’ ఒరిజినల్‌ని మరిపించేసింది.. అని చెప్పలేంగానీ, ఒరిజినల్ సాంగ్‌కి గొప్ప ట్రిబ్యూట్‌గా దీన్ని చెప్పుకోవచ్చు.