Adipurush Bookings.. ‘ఆదిపురుష్’.! ఈ ఏడాది విడుదలవుతున్న సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి.!
భారీ బడ్జెట్ మాత్రమే కాదు.. అంతకు మించి, ఆధ్మాత్మిక కోణంలోనూ ఈ సినిమాకి చాలా చాలా ప్రత్యేకత వుంది.
సాధారణంగా ‘ప్రేక్షక దేవుళ్ళు’ అంటుంటారు సినీ ప్రముఖులు.. తమ తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకునే క్రమంలో.!
Adipurush Bookings.. థియేటర్లకు పోటెత్తనున్న భక్తులు..
కానీ, ఈసారి పరిస్థితి చాలా చాలా ప్రత్యేకం. ఆ ప్రేక్షక దేవుళ్ళు భక్తులుగా మారి, థియేటర్లకు వస్తున్నారు.
ఎందుకంటే, సినిమా థియేటర్లలో హనుమంతుడు కొలువు దీరనున్నాడు. తెరపై శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడు.. వీళ్ళతోపాటు రావణుడూ కనిపిస్తాడు.

ప్రేక్షకులతో కలిసి హనుమంతుడు ‘ఆదిపురుష్’ సినిమా చూస్తాడట.! ఔను, ‘రామనామం’ ఎక్కడ వినిపిస్తే, అక్కడ హనుమంతుడు వుంటాడు మరి.!
అందుకే, ప్రతి సినిమా థియేటర్లోనూ.. ప్రతి షో సందర్భంగా ఓ టిక్కెట్టుని హనుమంతుడికి రిజర్వ్ చేసేస్తున్నారు.
Adipurush Bookings.. అందుకే.. భక్తిని చాటుకుందుకే..
జై శ్రీరామ్.. జై హనుమాన్.. నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోనున్నాయ్.! టిక్కెట్లు విక్రయిస్తున్న కేంద్రాల వద్దనే ఈ నినాదాలు హోరెత్తిపోతున్నాయ్.
తెలుగు రాష్ట్రాలతో పోల్చితే, నార్త్‌లో ఈ భక్తి హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. టిక్కెట్ బుకింగ్స్.. ‘న భూతే.. న భవిష్యతి..’ అనేలా జరుగుతున్నాయ్.
ప్రభాస్, కృతి సనన్ నటించిన ఈ సినిమాని ఓం రౌత్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Also Read: Disha Patani PROJECT K: కొత్తగా.. సరికొత్తగా.!
కాగా, ‘ఆదిపురుష్’ సినిమా కోసం తెలంగాణలో మొత్తం 10 వేల టిక్కెట్లను ఉచితంగా అందిస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ.
మరోపక్క, సినీ నటుడు మంచు మనోజ్ ఏకంగా 2500 టిక్కెట్లను కొనుగోలు చేసి, వాటిని ఉచితంగా కొందరు ప్రేక్షకులకు అందిస్తున్నాడు.
ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికీ 101 టిక్కెట్ల చొప్పున అందిస్తోంది శ్రేయాస్ మీడియా సంస్థ.
పలువురు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు కొనుగోలు చేసి, ఆయా టిక్కెట్లను అనాధలకు, వృద్ధులకు, విద్యార్థులకు అందిస్తున్న విషయం విదితమే.