Adipurush Hanuman Business.. ‘ఆదిపురుష్’ సినిమాతో సమాజాన్ని ఉద్ధరించేస్తున్నామనే భావనలో మేకర్స్ వున్నట్లు కనిపిస్తోంది.!
సినిమా అంటే వ్యాపారం.! ఇక్కడ ‘ఆదిపురుష్’ టీమ్ చేసేది కూడా అదే.! భక్తి ఎప్పుడో లాభసాటి వ్యాపారమైపోయింది. ఆ వ్యాపారానికి ‘భక్తి’ అనే పేరు పెట్టడం చాలామందికి అస్సలు నచ్చడంలేదు.
ఎవరికి నచ్చినా నచ్చకున్నా.. తమ సినిమా పబ్లిసిటీ స్టంట్స్ కోసం హనుమంతుడి భక్తిని వాడేసుకుంది ‘ఆదిపురుష్’ (Adipurush Movie) టీమ్.!

సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో హనుమాన్ కోసం ఓ సీటు ఖాళీగా వుంచుతామని చిత్ర నిర్మాణ సంస్థ (తెలుగులో ఈ సినిమాని విడుదల చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ) ప్రకటించింది.!
Adipurush Hanuman Business.. హనుమాన్ టిక్కెట్.. హనుమాన్ సీట్.!
ఇంతకీ, హనుమాన్‌కి (Hanuman) ఏ టిక్కెట్ కేటాయిస్తున్నారు.? హనుమంతుడు ఏ సీట్లో కూర్చుంటాడు.? ఏమో, అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
హనుమాన్‌కి కేటాయించే సీటు తాలూకు టిక్కెట్టుని అమ్మబోరట.! హనుమాన్ మీద భక్తితో అయినా, థియేటర్లలో సినిమా (Adipurush Movie) ఆడాల్సిందే, ఆడించాల్సిందేనన్నమాట.

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) నటిస్తోన్న ఈ ‘ఆదిపురుష్’ సినిమాని ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎంత గింజుకుంటున్నా ఈ సినిమాకి తెలుగు నేటివిటీ రావడంలేదు.
మొదటి నుంచీ హనుమాన్ విషయంలో..
‘ఆదిపురుష్’ (Adipurush) నుంచి వస్తున్న ప్రతి ప్రోమో, ప్రతి ఫొటోలో.. హనుమంతుడి పాత్రతో హిందువులు కనెక్ట్ కాలేకపోతున్నారు.
కారణం, ఆ హనుమంతుడి (Hanuman Adipurush) గెటప్, ఏమాత్రం హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా లేకపోవడమే.!
Also Read: 300 మంది బలి: రైలూ.. రైలూ.. నిన్నెవరు ‘దెబ్బ’తీశారు.?
హనుమంతుడికి థియేటర్లలో సీటు కేటాయిస్తారు సరేగానీ.. శ్రీరాముడి సంగతేంటి.? లక్ష్మణుడి పరిస్థితేంటి.? సీతకి ఎందుకు ఆ అవకాశం ఇవ్వడంలేదు.?

గతంలో దేవుళ్ళ సినిమాలు విడుదలైతే, థియేటర్ల వద్ద ఆయా దేవుళ్ళ విగ్రహాలు పెట్టేవారు. అమ్మవారి సినిమాలకు హంగామా.. వేరే లెవల్‌లో వుండేది.
ఆ తరహాలో, ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్ల వద్ద శ్రీరాముడి విగ్రహాలు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారేమో.!
అలా విగ్రహాలు పెడితే.. అది పరమ రొటీన్ వ్యవహారం అని ప్రేక్షకులు అనుకునే అవకాశం వుంది. అందుకే, ఈ ‘హనుమాన్ సీటు’ అన్నమాట.!
ఒక్కో సీటు అంటే.. థియేటర్‌కి గరిష్టంగా 300 రూపాయలు. అబ్బో.. గొప్ప త్యాగమే చేసేస్తూ.. భక్తిని చాటుకుంటున్నారని సరిపెట్టుకోవాల్సిందే.