Adipurush Om Raut Telugu.. ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధమైంది. తెలుగుతోపాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన అత్యంత భారీ చిత్రమిది. రామాయణాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది.
నిజానికి, ‘ఆదిపురుష్’ (Adipurush) స్ట్రెయిట్ సినిమానో.. లేదంటే, గ్రాఫిక్స్ సినిమానో.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
కొన్నాళ్ళ క్రితం మోషన్ క్యాప్చర్ విధానంలో తీసిన ‘కొచాడియాన్’ తరహాలోనే ఈ ‘ఆదిపురుష్’ కూడా వుండబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
Adipurush Om Raut Telugu.. ఈ తెగులు పైత్యమేంటి.?
‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్వీటేశాడు. అందులో వివిధ భాషల్లో ‘శక్తిమంతులం.. భక్తిమంతులం’ అని పేర్కొనాలనుకున్నాడు.

కానీ, ఇక్కడే తేడా వచ్చేసింది. ఇతర భాషల్లో తప్పులు దొర్లాయా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తెలుగుకి మాత్రం తెగులు పట్టించేశాడు.
‘‘శకెత వంతుల్ం, భకెత మంతుల్ం’ అంటూ ఓం రౌత్ (Om Raut Adipurush) రాసుకొచ్చాడు.. అదీ హనుమంతుడి ఫొటోలతో.!
తెలుగుకి తెగులు పట్టించడమే పని.!
‘ఆదిపురుష్’ సినిమాలోని డైలాగులు.. డబ్బింగ్ సినిమాని తలపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాల్లో కూడా ఈ మధ్య డైలాగులు బాగానే వుంటున్నాయి.
కానీ, ‘ఆదిపురుష్’ సినిమాలోని తెలుగు డైలాగులు అస్సలు వినడానికి బాగాలేవు. మన తెలుగు కాదిది.. అనే భావన వ్యక్తమవుతోంది.
Also Read; Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
తెలుగు హీరో.. తెలుగు మార్కెట్ అతనికి చాలా చాలా పెద్దది.! అలాంటప్పుడు, తెలుగుని నిర్లక్ష్యం చేస్తే ఎలా.?
ఈ విషయంలో ప్రభాస్ కూడా ఒకింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వుండాల్సింది. తప్పుని సరిదిద్దడానికైనా ప్రయత్నించి వుండాల్సింది.!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ఇందులో సీత పాత్రలో కనిపించనుంది.