Agent Review.. అక్కినేని అఖిల్ మార్కెట్‌ని మించి ఖర్చు చేశారు ‘ఏజెంట్’ సినిమా కోసం. దర్శకుడు సురేందర్ రెడ్డి అంటే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు.!
‘కిక్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి (Surender Reddy), ‘కిక్-2’ లాంటి డిజాస్టరూ ఇచ్చాడు.!
రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేయడంలో అయినా, మెరుపులా డాన్స్ చేయడంలో అయినా.. అఖిల్ (Akkineni Akhil) తగ్గేదే లే.. అంటాడు.!
‘ఏజెంట్’ సినిమాతో తెలుగు తెరకు పరచయమవుతోంది అందాల భామ సాక్షి వైద్య (Sakshi Vaidya). అన్నట్టు, ‘వైల్డ్ సాలా’ అంటూ సినిమా ప్రమోషన్లని చిత్ర యూనిట్ వేరే లెవల్‌లో చేసింది.
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించగా, బాలీవుడ్ నటుడు డినో మారియా విలన్ రోల్ చేశాడు.
ఇంతకీ, అఖిల్ – సురేందర్ రెడ్డిల కలయిక, భారీ బడ్జెట్.. అందునా స్పై థ్రిల్లర్ అయిన ‘ఏజెంట్’ ఎలా వుంది.? కథలోకి వెళితే..
Agent Review.. పరమ రొటీన్ రొట్ట కథ, కథనాలు..
స్పై థ్రిల్లర్స్ కొత్తేమీ కాదు.! ఈ మధ్య చాలా వచ్చేస్తున్నాయ్.! కొత్తగా ట్రై చేస్తున్నారు కొందరు.. ఇంకొందరేమో, పాత ఫార్మాట్ ఫాలో అవుతున్నా, కొత్తగా ఆలోచిస్తున్నారు.

ఇంకొందరు, అన్ని అవకాశాలూ వున్నా.. పాత ముతక కథ, కథనాలతో బోర్ కొట్టిస్తున్నారు. ‘ఏజెంట్’ రెండో కోవకే చెందుతుంది.
హీరో అఖిల్, ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు. దర్శకుడు కూడా విషయం వున్నోడే. సీనియర్ నటుడు మమ్ముట్టి అదనపు అడ్వాంటేజ్.
కానీ, ఇవేవీ సినిమాకి (Akkineni Akhil Agent) పనికిరాలేదని చెప్పొచ్చు. అఖిల్ కష్టం వృధా అయ్యింది. మమ్ముట్టి అనుభవం గంగపాలైంది.
సినిమాటోగ్రఫీ సూపర్బ్‌గా వున్నా, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నా.. కథ, కథనాల్లో డొల్లతనం సినిమాకి మైనస్ అయ్యింది. సాగతీతకి ప్రేక్షకుడు విసిగిపోతాడు.
సినిమాలో హీరోయిన్ లేకపోయినా వచ్చే నష్టమేమీ లేదనిపిస్తుంది. అస్సలేమాత్రం ప్రాధాన్యత లేని పాత్రని సినిమాలో పెట్టడం ఎందుకు.?
ఒక్కటంటే ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేకపోవడం ఈ సినిమాలో మరో స్పెషాలిటీ. సాధారణంగా ఇలాంటి సినిమాలకు ఎడిటింగ్ చాలా కీలకం. కానీ, అది దెబ్బేసింది.
బూడిదలో పోసిన పన్నీరే..
కోట్లు గుమ్మరించేశారు.. అంతా బూడిదలో పోసిన పన్నీరే.! సినిమా ప్రమోషన్ల మీద పెట్టిన శ్రద్ధలో పదో వంతు కథ, కథనాల మీద పెట్టి వుంటే బెటర్ రిజల్ట్ వచ్చి వుండేదేమో.!
Also Read: Virupaksha Niharika Konidela: బావా.. నీ కోసమే.!
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఒక్కటీ అనుకోకుండా అఖిల్‌కి కలిసొచ్చింది. మళ్ళీ ఇప్పుడు అఖిల్ రీ-లాంఛ్ కోసం వెయిటింగ్ చేయాల్సిందే.