Aishwarya Kasthuri Plastic Beauty.. ఇద్దరూ సినీయర్ నటీమణులే.! ఒకరేమో యావత్ భారతదేశాన్నీ ఉర్రూతలూగించేస్తే.. ఇంకొకరు, సౌత్‌లో ఓ మోస్తరు పాపులారిటీ సంపాదించుకున్నారు.!
ఆ ఇద్దరిలో ఒకరు ఐశ్వర్యరాయ్, ఇంకొకరు కస్తూరి. అసలు ఈ ఇద్దరి ప్రస్తావన ఇప్పుడెందుకంటే, ఐశ్వర్య ప్లాస్టిక్ అందంపై కస్తూరి గుస్సా అయ్యింది గనుక.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే, అందాల భామల హొయలకు కేరాఫ్ అడ్రస్. రెడ్ కార్పెట్ మీద అందాల భామలు ఒలికించే హొయలు చూడటానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదేమో.
Aishwarya Kasthuri Plastic Beauty.. ఎందుకీ ప్లాస్టిక్ గ్లామర్.?
ఎన్నో ఏళ్ళుగా ఐశ్వర్య, కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి తనదైన గ్లామర్ అద్దుతూ వస్తోంది. ఈసారి కూడా, ఆ రెడ్ కార్పెట్ మీద తన అందాన్ని అలా అలా పరిచేయడానికి వెళ్ళింది.
ఇటీవల ఐశ్వర్య చేతికి గాయం కాగా, ఆ గాయం నుంచి ఇంకా ఆమె పూర్తిగా కోలుకోలేదు. చేతికి కట్టు కట్టుకుని, ఐశ్వర్య యధావిధిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేసింది.

అది సరేగానీ, కస్తూరి సంగతేంటి.? అక్కడికే వచ్చేద్దాం.! కేన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్య ఒకలబోసిన సోయగం, కస్తూరికి నచ్చలేదు.
ఎందుకు నచ్చలేదంటే, అది ప్లాస్టిక్ అందం గనుక.! కాలం ఎవర్నీ వదలదు.. ఐశ్వర్యని కూడా వదల్లేదు. కాలానికి ఐశ్వర్య అతీతమేమీ కాదు.. అని సెలవిచ్చింది కస్తూరి.
సహజమైన అందం.. ఇలా తయారైంది పాపం.!
సహజమైన అందం ఐశ్వర్య సొంతం.. ఇలా ప్లాస్టిక్ అందాన్ని ఆమె ప్రదర్శించడం అస్సలేం బాగాలేదన్నది కస్తూరి వాదన.
నిజమే, ఐశ్వర్యని కేన్స్‌లో చూసినవాళ్ళంతా, ‘అవసరమా ఐశ్వర్యకి ఈ వయసులో ఇదంతా..’ అని ముక్కున వేలేసుకున్నారు.

బొటోక్స్ కారణంగా, ఐశ్వర్య మొహంలో చిత్ర విచిత్రమైన మార్పులు కనిపించాయ్. గత కొన్నేళ్ళుగా ఐశ్వర్యలో ఈ మార్పులు ఒకింత ఇబ్బందికరంగానే వున్నాయి చూస్తున్నవాళ్ళకి.
వయసు మీద పడుతోంది కదా.. అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. సహజమైన అందానికి, వయసుతో పన్లేదు. వయసు తెచ్చిన మార్పులకు సహజమైన అందం, మరింత అందంగా వుంటుంది.
Also Read: ‘సత్యభామ’గా కాజల్.! సమ్‌థింగ్ వెరీ స్పెషల్.!
ఇదిగో, ఇలా ప్లాస్టిక్ గ్లామర్ వైపు మొగ్గు చూపితే, ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అన్నట్టు, కస్తూరి తానెప్పుడూ అతిగా మేకప్ వేసుకోననీ, వయసుని దాచేసుకోడానికి ఎలాంటి బొటోక్స్ తీసుకోనని, ప్లాస్టిక్ గురించి అస్సలు ఆలోచించనని ఓ నెటిజన్ సంధించిన ప్రశ్నకు బదులిస్తూ చెప్పింది.