Aishwarya Rai Weight.. అందాల ఐశ్వర్యం.. ఐశ్వర్యా రాయ్ వయసెంత.? 51 ఏళ్ళు.! ఆ వయసులో, ఫిట్‌నెస్ మెయిన్‌టెయిన్ చెయ్యాలంటే అంత తేలిక కాదు కదా.!
ఏం, రేఖ వయసెంత.? ఆమె ఫిట్టుగా కనిపించడంలేదా.? ఇంకో నటి, ఫిట్‌నెస్ మెయిన్‌టెయిన్ చేయడంలేదా.? అన్న ప్రశ్నలు రావడం సహజమే.
ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా వుంటుంది. ఐశ్వర్య రాయ్ కూడా ఒకప్పుడు మెరుపు తీగలానే వుండేది. ఇప్పుడామె, ఒకింత బరువు సమస్యతో ఇబ్బంది పడుతోంది.
Aishwarya Rai Weight.. ఆమె తప్పు ఏమున్నదబ్బా..
ఐశ్వర్య రాయ్ వయసుని దృష్టిలో పెట్టుకుని, బరువు విషయంలో ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించడం మానుకుంటే మంచిదన్న కనీసపాటి ఇంగితం మీడియాకి లేకుండా పోయింది.
తాజాగా, కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ సందడి చేసింది. అయితే, ‘అధిక బరువు’ గురించి ఐశ్వర్య రాయ్‌ని మీడియా కొన్ని ప్రశ్నలు వేయడంతో, ఆమె కొంత ఇబ్బంది పడింది.

అంతలోనే తేరుకుని, ‘బరువుగానే వున్నా.. బానే వున్నాను కదా. నా బరువు నాకు సమస్యగా లేదు..’ అంటూ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యాఖ్యానించింది.
నిజమే కదా.! ఇలాంటి విషయాల్లో గుచ్చి గుచ్చి ప్రశ్నించడం సబబు కాదని, మీడియా తెలుసుకోవాలి కదా.?
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్ ఐశ్వర్య రాయ్‌కి ఒకప్పుడు వుండేది. గత కొన్నాళ్ళుగా ఆమె సినిమాలకి కొంత దూరంగా వుంది.
అంతర్జాతీయ సినీ వేదికలపై ఐశ్వర్య రాయ్ అంటే, ఓ సంచలనం. అప్పటికీ, ఇప్పటికీ ఈ విషయంలో ఐశ్వర్య రాయ్‌కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.