Akhanda2 Releasing Finally.. మరి కొద్ది గంటల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది ‘అఖండ-2’ సినిమా.!
నందమూరి బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ‘అఖండ-2’. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్.!
డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ అవ్వాల్సి వుండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది ‘అఖండ-2’. కోర్టు బయట సెటిల్మెంట్ల తర్వాత, ఎలాగైతేనేం.. ‘అఖండ-2’ ఊపిరి పీల్చుకుంటోంది.
బాలయ్య అభిమానులు, సినిమా రిలీజ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.. అయినాగానీ, కొన్ని భయాలూ అభిమానుల్ని వెంటాడుతున్నాయి.
మొన్నటికి మొన్న బీభత్సమైన హంగామా చేశారు అభిమానులు, సినిమా రిలీజ్ కోసం. కొందరైతే, సినిమా విడుదల కాకుండానే రివ్యూలు రెడీ చేసేసి, యూ ట్యూబ్ ఛానళ్ళలో పోస్ట్ చేసేశారు.
సోషల్ మీడియాలో ఆ రివ్యూలు వైరల్ అయిపోయాయి.. ఆ తర్వాత అదంతా ట్రోల్ కంటెంట్ అయిపోయింది. ఈ క్రమంలో, ఈ రోజు ప్రీమియర్స్ విషయమై కొంత ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
ప్రీమియర్స్‌కి రంగం సిద్ధమైంది.. బుకింగ్స్ మాత్రం డల్‌గా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితీ అంతే. ఓవర్సీస్‌లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
భారీ బడ్జెట్‌తో ‘అఖండ-2’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బ్రేక్ ఈవెన్ నెంబర్స్ కూడా గట్టిగానే వున్నాయ్. వాటిని అందుకోవాలంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలిక కాదు.
మరోపక్క, ‘అఖండ-2’ కోసం, ఒక రోజు విడుదలను వాయిదా వేసుకున్న ‘మోగ్లీ’ టీమ్‌కి సింపతీ పెరుగుతోంది.! చిన్న సినిమానే అయినా ‘మోగ్లీ’ నుంచి, ‘అఖండ-2’కి థ్రెట్ అయితే లేకపోలేదు.
