Akhanda2 Thaandavam Samyuktha Item.. సినిమాలో హీరోయిన్ ‘అవసరం’ రోజు రోజుకీ తగ్గిపోతోంది. అసలు హీరోయిన్‌తో పనేంటి.? అన్నట్లుగా తయారైంది వ్యవహారం.
శ్రీలీల చేస్తున్న సినిమాలన్నీ దాదాపుగా అంతే. ఆమెకు రెమ్యునరేషన్ వచ్చేస్తోంది.. అవకాశాలూ వస్తున్నాయి. కానీ, స్క్రీన్ స్పేస్ మాత్రం పెద్దగా దక్కడంలేదు. అదే మ్యాజిక్.
ఫలానా సినిమాలో శ్రీలీల నటిస్తోందిట.. అని, సినిమా ప్రారంభానికి ముందు గాసిప్స్.. మామూలే.
సినిమా ప్రమోషన్లలోనూ శ్రీలీల ఉత్సాహంగానే కనిపిస్తోంది. కట్ చేస్తే, సినిమాలో ఆమె రోల్ చాలా వరకు కట్ అయిపోతోంది.
తాజాగా, ‘అఖండ-2’ సినిమాలో సంయుక్త మీనన్‌కీ దాదాపు అదే పరిస్థితి వచ్చింది.
Akhanda2 Thaandavam Samyuktha Item.. హీరోయిన్ తక్కువ.. ఐటమ్ బాంబుకి ఎక్కువ..
సంయుక్త మీనన్, నందమూరి బాలకృష్ణతో కలిసి ‘జాజికాయ’ అంటూ ఓ పాటేసుకుంది ‘అఖండ-2’ సినిమా కోసం. బాలయ్య అభిమానులు, ఊగిపోయారు ఈ పాట చూసి.
తొలుత, ఈ పాట చెయ్యకూడదనే అనుకుందట సంయుక్త మీనన్. దర్శకుడు బోయపాటి ఒప్పించాడట. ‘నువ్వు చెయ్యగలవ్..’ అని ముందుకు నడిపించాడట.

ఈ విషయాన్ని స్వయంగా సంయుక్త మీనన్ సెలవిచ్చింది. ‘చెయ్యకూడదని అనుకున్నా’ అని నేరుగా చెప్పలేదు కదా.! అందుకే, ‘భయపడ్డా..’ అని చెప్పింది సంయుక్త.
సినిమా విడుదలయ్యింది.. తెరపై సంయుక్తని చూసిన బాలయ్య అబిమానులు, బయటకొచ్చాక మాత్రం ‘ఆ పాటలో సంయుక్త వేస్ట్.. అసలు సినిమాలో హీరోయిన్ వేస్ట్..’ అనేస్తున్నారు.
Also Read: అధరామృతం.. అవ్వకూడదు విషపూరితం.!
హీరోయిన్‌ని పెట్టి వుండకూడదు.. ఒకవేళ పెట్టి వున్నా, రెండు మూడు పాటలైనా ఆమెతో బాలయ్యకి వుండి వుండాల్సింది.. కొన్ని సీన్స్ కూడా వుంటే బావుండేది.. అంటున్నారు బాలయ్య అభిమానులు.
ఇదీ, హీరోయిన్లకు సినిమాల్లో దక్కుతున్న స్పేస్, గౌరవం.! రెమ్యునరేషన్ ఒక్కటే సరిపోతుందా.? గుర్తింపు అవసరం లేదా.? ఈ విషయమై దర్శక నిర్మాతలు ఒకింత ఆత్మ విమర్శ చేసుకోవాలి.
మొన్నటికి మొన్న ‘కింగ్డమ్’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి ఏమయ్యిందో చూశాం కదా. ఆమె మీద చిత్రీకరించిన ఓ పాటను సినిమాలో లేకుండా చేసేశారు.
