Akhil Agent Wild Sala.. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయితే, సినిమాకి సంబంధించి ఫస్ట్ టాక్ ఏంటన్నది బయటకు రాకుండానే, సినిమాపై విపరీతమైన నెగెటివిటీ కనిపిస్తోంది.
‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అన్నాడు.. ఇక్కడేమో అఖిల్ ‘వైల్డ్ సాలా’ అంటున్నాడు.. అంటూ నెగెటివిటీ మొదలు పెట్టారు.
‘ఏజెంట్’ కూడా ‘లైగర్’లానే వాషౌట్.. అన్నది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారబ్బా.?
Akhil Agent Wild Sala.. దెబ్బ కొట్టారు..
కొన్నాళ్ళ క్రితం ‘అక్కినేని.. తొక్కినేని..’ అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
తప్పు చేసింది బాలయ్య.! కానీ, నష్టపోతున్నది అక్కినేని.!
తొక్కినేని.. అంటూ బాలయ్య తప్పు చేస్తే, ‘వైల్డ్ సాలా’ అఖిల్ ‘ఏజెంట్’ని నందమూరి అభిమానులే తొక్కెయ్యడమేంటో.!
అయినా, ఒకరు తొక్కేస్తే సినిమా దెబ్బ తింటుందా.?
కంటెంట్ వుంటేనే ఏ సినిమా అయినా ఆడేది.. కంటెంట్ లేకపోతే అంతే సంగతులు.!
Mudra369
‘అక్కినేని, నందమూరి.. ఈ గొప్ప వ్యక్తుల గురించి తక్కువగా మాట్లాడితే, అది మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లు..’ అంటూ అఖిల్, నాగచైతన్య ట్వీట్లేశారు.

‘ప్రేమ అక్కడ కాదు.. ఇక్కడ దొరుకుతుంది..’ అంటూ నాగచైతన్య, అఖిల్‌కి (Akkineni Akhil) కౌంటర్ ఎటాక్ చేశాడు నందమూరి బాలకృష్ణ.
Also Read: జర్నలిస్టుకి గూబ గుయ్యిమనిపించిన సంయుక్త.!
ఆ వివాదం ఇంకా మర్చిపోయినట్టు లేరు నందమూరి అభిమానులు. ఆ నందమూరి అభిమానులే, ఇప్పుడు అక్కినేని సినిమా ‘ఏజెంట్’ మీద నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారు.
‘కర్మ సిద్ధాంతం పని చేస్తోంది.. సినిమా దొబ్బింది..’ అంటూ ట్రోల్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
ఇదిలా వుంటే, అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’కి (Agent Akhil Akkineni) మద్దతుగా టాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోలు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే స్పందించారు.
ఆయా హీరోల అభిమానులూ ‘ఏజెంట్’ (Agent Movie) సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నారు.. అఖిల్‌కి బాసటగా నిలుస్తున్నారు.!