Yoga Lakshmi Heart Beat.. ఎవరీ డస్కీ బ్యూటీ.? అంటూ, నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు ఆ బ్యూటీ కోసం.! పేరేమో యోగ లక్ష్మీ.!
ఓ వెబ్ సిరీస్ ద్వారా పాపులరైందీ డస్కీ బ్యూటీ. తమిళ వెబ్ సిరీస్ అయినా, తెలుగు ఓటీటీ ప్రియులనీ ఆకట్టుకుంది.
వెబ్ సిరీస్ అంటే, వివిధ భాషల్లో వస్తుండడం తెలిసిన విషయమే. అలా తెలుగులోనూ సందడి చేసింది ‘హార్ట్ బీట్’ అనే వెబ్ సిరీస్.
ఓ ఆసుపత్రిలో నడిచే కథ ఈ ‘హార్ట్ బీట్’. యంగ్ డాక్టర్స్ మధ్యన లవ్, ఆసుపత్రిలో వైద్య చికిత్సలు.. ఇలా బోల్డంత కథ నడుస్తుంటుంది ‘హార్ట్ బీట్’లో.
Yoga Lakshmi Heart Beat.. హార్ట్ బీట్.. ఎవరికి వారే స్పెషల్..
ఫన్, ఎమోషన్స్.. వెరసి, ‘హార్ట్ బీట్’ సమ్‌థింగ్ స్పెషల్. అందులో, అనుమోల్ (డాక్టర్ రది), దీపా బాలు (రీనా) కీలక పాత్రల్లో నటించారు.
అనుమోల్, దీపా బాలు.. ప్రధాన పాత్రల్లో నటించినా, మిగతా నటీనటులందరికీ తగిన ప్రాధాన్యత లభించింది ఈ వెబ్ సిరీస్‌లో. ఎవరూ తక్కువ కాదు.. అనేంతలా డిజైన్ చేశారు ఆయా పాత్రల్ని.
అలా ఓ పాత్రలో మెప్పించింది యోగ లక్ష్మి, ‘హార్ట్ బీట్’లో ఆమె పాత్ర పేరు తేజు. వంద ఎపిసోడ్స్‌తో సాగిన మొదటి సీజన్ తర్వాత, రెండో సీజన్ ఈ మధ్యనే ప్రారంభమైంది.
టూరిస్ట్ ఫ్యామిలీతో పెరిగిన క్రేజ్..
ఇందలోనే, యోగ లక్ష్మీకి సినిమా అవకాశాలూ పోటెత్తడం షురూ అయ్యింది. తాజాగా, ఆమె నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలో శశికుమార్, సిమ్రాన్ తదితరులు ప్రధాన తారాగణం. ఓ పోలీస్ అధికారి కుమార్తెగా నటించింది యోగ లక్ష్మీ.!
Also Read: ‘పంపకాల పంచాయితీ’నే తెలుగు సినిమాని చంపేస్తోంది.!
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, మోడలింగ్, ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్.. ఇదీ యోగ లక్ష్మీ ఒక్కోె మెట్టూ పైకెక్కుతూ వస్తోంది. ఆన్ స్క్రీన్ ఆమె ప్రదర్శించే ఆటిట్యూడ్.. ఆమెకి అదనపు ఆకర్షణ.
తమిళ సినీ పరిశ్రమ నుంచే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమ నుంచీ యోగ లక్ష్మీని అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయట.