Akshay Kumar About Sushant Singh.. తాము కూడా అందరిలాంటి మనుషులమేనని అంటున్నాడు ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar).
సినిమా అంటే అమితమైన అబిమానంతో ఈ రంగంలోకి వచ్చామనీ, ఈ రంగంలో తాము ఇంతలా ఎదగడానికి కారణం ప్రేక్షకులేనని చెప్పిన అక్షయ్‌కుమార్ (Akshay Kumar About Sushant), దురదృష్టవశాతూ ‘డ్రగ్స్’ అలాగే, ‘లైంగిక వేధింపులు’ వంటి అంశాలతో సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నాడు.
ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు తమ గురించి ఆలోచించే విధానం భిన్నంగా వుంటుందనీ, అన్ని రంగాల్లో వున్నట్లే.. ఇక్కడా కొన్ని తప్పులు జరుగుతున్నాయని అక్షయ్‌కుమార్ చెప్పాడు.
‘బాలీవుడ్ క్లీన్‌గా వుందని నేను చెప్పలేను. ఇక్కడా సమస్యలున్నాయి. అయితే, కొందరు చేస్తోన్న తప్పుల్ని మొత్తం సినీ పరిశ్రమకు ఆపాదించడం సబబు కాదు’ అని స్పష్టం చేశాడు ఈ బాలీవుడ్ హీరో.
Akshay Kumar About Sushant Singh.. మౌనం వీడక తప్పలేదు.!
సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ మరణం తర్వాత బాలీవుడ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎలా స్పందించాలో అర్థం కాక ఇన్నాళ్ళూ మౌనంగా వుండిపోయిన తాను, ఇప్పుడు మౌనం వీడక తప్పలేదని అన్నాడు.
‘చట్టం ముందు అందరూ సమానమే అని నమ్మేవాడ్ని నేను..’ అని చెప్పిన అక్షయ్, ఆయా అంశాల్లో విచారణ జరుగుతున్నందున, పుకార్లకు అవకాశం ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశాడు.
కాగా, పేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే కాదు, సందేశాత్మక సినిమాల్నీ ఇస్తున్న బాలీవుడ్, వివిధ సందర్భాల్లో ప్రజల్ని ఆదుకునేందుకు ముందుకొస్తోందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘సాఫ్ట్ టార్గెట్’గా మారుతున్న సినీ పరిశ్రమ పట్ల కొంత సున్నితంగా వ్యవహరించాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం, దీపికా పడుకొనే సహా పలువురు బాలీవుడ్ నటీమణులు విచారణను ఎదుర్కొంటుండడం తెలిసిన సంగతులే.
కొందరు బాలీవుడ్ ప్రముఖ హీరోలకూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి నోటీసులు వెళ్ళనున్నాయన్న ప్రచారం ఓ పక్క జరుగుతుండగా, అక్షయ్‌కుమార్.. తాజా పరిణామాలపై వ్యాఖ్యానించడం (Akshay Kumar About Sushant) గమనార్హం.