Akshay Kumar Citizenship బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారతీయుడా.? కాదా.? అన్న అంశం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఇదిప్పుడు జాతీయ సమస్యగా మారిపోయింది.!
నిజానికి, చాలాకాలంగా అక్షయ్ కుమార్ భారతీయతపై రచ్చ జరుగుతూనే వుంది. ‘దేశ భక్తి’ వంటి విషయాల్లో అక్షయ్ కుమార్ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు మరి.!
తప్పేముంది.? భారతీయత గురించి భారతీయులెవరైనా మాట్లాడొచ్చు. దేశ భక్తి గురించీ మాట్లాడొచ్చు. కానీ, అసలు విషయం అది కాదు.!
Akshay Kumar Citizenship.. భారతీయుడు కాదా.?
అక్షయ్ కుమార్ భారతీయుడు కాదన్నది ఓ వాదన. ఆయనకు కెనడా పౌరసత్వం వుండడమే అసలు సమస్య. చాలాకాలం క్రితం అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం తీసుకున్నాడు.
సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించీ, ప్రయత్నించి.. సరైన సక్సెస్‌లు రాక, కెనడాలోని స్నేహితుడి వద్ద సెటిలైపోదామనుకున్నాడు.. అక్కడే ఉద్యోగావకాశం కోసం ప్రయత్నించాడు అక్షయ్ కుమార్.

ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్‌కి (Akshay Kumar) కెనడా పాస్‌పోర్ట్ లభించింది. అలా అక్కడ ఆయనకు పౌరసత్వం లభించినట్లయ్యింది.
ఇంకోపక్క, సినిమాల్లో సక్సెస్‌ల మీద సక్సెస్‌లు వచ్చి పడ్డాయ్ అక్షయ్ కుమార్‌కి. దాంతో, కెనడా వెళ్ళాల్సిన అవసరం రాలేదు అక్షయ్ కుమార్‌కి.
అక్షయ్ కుమార్‌కి విదేశీ పాస్‌పోర్ట్ వుంటే.. విదేశీ పౌరసత్వం వుంటే.. భారతీయత గురించి మాట్లాడకూడదా.?
క్లాసులు పీకేటప్పుడు.. కాస్తంత సంయమనం పాటిస్తే, అక్షయ్‌కి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో.!
Mudra369
కెనడా వెళ్ళలేదు సరే.. కెనడా పౌరసత్వం ఎందుకు అక్షయ్ కుమార్ (Akshay Kumar) వదులుకోలేదు.? ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
విషయం ముదిరి పాకాన పడ్డం.. ట్రోలింగ్ తీవ్రంగా జరుగుతుండడంతో అక్షయ్ కుమార్ త్వరలోనే తాను కెనడా పౌరసత్వం వదులుకోనున్నట్లు ప్రకటించాడు. అదీ అసలు సంగతి.
Also Read: అరెవో సాంబా.! ఓ స్పెషల్ సాంగ్ ఏస్కో.!
విదేశాల్లో సెటిలైన మన బంధువుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. అక్షయ్ కుమార్‌ని మాత్రం తూలనాడుతున్నాం. తప్పదు మరి, అక్షయ్ చేసే ఓవరాక్షన్ కారణంగానే ఇవన్నీ.!