Alia Bhat Sun Kissed: అయ్యో పాపం అలియా భట్.! అనవసర వివాదం కొనితెచ్చుకుంది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పుణ్యమా అని.!
అదేంటీ, బోల్డంత రెమ్యునరేషన్ ఇచ్చి సౌత్ సినిమాకి ఆమెని ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) మేకర్స్ తీసుకొస్తే, ఆ సినిమా ఆమెకు తిప్పలు తెచ్చిపెట్టడమేంటి.?
అసలు విషయం వేరే వుంది. సోషల్ మీడియాలో పాపని గట్టిగా ఆడేసుకున్నారు నెటిజన్లు. ఎందుకో తెలుసా.? ఇంకెందుకు, తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సంబంధిత విషయాల్ని తొలగించడం వల్లనే.! అద్గదీ అసలు సంగతి.
అవసరమా.? ఈ గోలంతా.!
వివాదం ముదిరి పాకాన పడేసరికి, అలియా భట్ జాగ్రత్త పడింది. అబ్బే, అదేం లేదంటూ కవరింగ్ కూడా ఇచ్చుకుంది.
రాజమౌళి అంటే తనకు చాలా గౌరవమనీ, తెలుగు సినీ పరిశ్రమలోకి ‘ఆర్ఆర్ఆర్’తో ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా వుందని చెప్పుకుంది.
మరెందుకు ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సంబంధిత పోస్టుల్ని తొలగించావ్.? అనడిగితే, ‘అబ్బే, అదేమీ కావాలని చేసింది కాదు.. స్పేస్ తగ్గించడం కోసం అలా చేస్తుంటామంతే..’ అని వివరణ ఇచ్చిందిగానీ, అదంత సహేతుకంగా అనిపించలేదు.
సరే, ఆ తర్వాత మళ్ళీ ‘ఆర్ఆర్ఆర్’ పోస్టుల్ని పెట్టడం ద్వారా అలియా భట్ (Alia Bhatt) ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసిందనుకోండి.. అది వేరే సంగతి.
Alia Bhat Sun Kissed.. బంగారు వర్ణంలో మెరిసిపోతోంది.!
ఇక, అలియా బట్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన పై ఫొటో.. వైరల్ అయ్యింది. లేలేత సూర్య కిరణాలు.. ఆమె మీద పడే సరికి, ఆమె బంగారు వర్ణంలోకి మారిపోయినట్లుంది కదూ.!
నిజ్జంగానే దేవతలా వున్నావ్.. అంటూ అలియా భట్‌ని ఆమె అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.
Also Read: రామ రామ.! అపార్ధం చేసుకున్నాం కదమ్మా.!
చక్కనమ్మ ఏం చేసినా అందమే. కానీ, వివాదాల జోలికి వెళితేనే.. ఒకింత చివుక్కుమంటుంది అబిమానులకి.
అలా అభిమానుల్ని గిచ్చడం ఆమెకు (Alia Bhatt) అదో సరదా.! ఆ సరదా కారణంగానే అడపా దడపా షాకులు కూడా తగులుతుంటాయ్ మరి.!