Alia Bhatt Business.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కొత్త వ్యాపారం మొదలు పెట్టేసింది. రణ్‌బీర్ – అలియా భట్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కానున్న సంగతి తెలిసిందే.
గర్భం దాల్చిన కారణంగా, తన శరీరంలో కొత్త మార్పులు వస్తున్నాయనీ, ఆ మార్పులకు అనుగుణంగా వస్త్రధారణ వుండాలన్న కోణంలో, సరికొత్తగా ఆలోచించిందట. అలియా భట్.
ఏకంగా ‘మెటర్నిటీ వేర్’ తాను స్వయంగా డిజైన్ చేసి, వాటిని అమ్మకానికి పెడతానని అలియా భట్ చెబుతోంది.
Alia Bhatt Business.. కాదేదీ యాపారానికనర్హం.!
సెలబ్రిటీలు అంతే.! ఇప్పటికే చిన్న పిల్లల వస్త్రాలకు సంబంధించి అలియా భట్ ‘బిజినెస్’ చేస్తోంది. అది చాలక, ఇప్పుడు మటర్నరీ వేర్ వ్యాపారం కూడా మొదలు పెట్టేసిందన్నమాట.
వాట్ నెక్స్ట్.? ఏమో, ఇంకేం కొత్త కొత్త ఆలోచనలు చేస్తుందోగానీ, అలియా భట్ (Alia Bhatt) ‘వ్యాపార’ తెలివితేటలకు అంతా ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి, అలియాతోనే ఇది ప్రారంభం కాలేదు. ఈ తరహా వ్యాపారాల్ని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చేసేశారు.. కొందరు మధ్యలోనే చేతులెత్తేస్తే, ఇంకొందరు వాటిని ఓ ప్యాషన్‌గా భావించి కొనసాగిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ కూడా.!
సినీ నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా ఇటీవలే చిన్న పిల్లలకు సంబంధించిన అవసరాలకు సంబంధించి ఓ వ్యాపారం మొదలు పెట్టింది.

ఇటీవల తల్ల అయిన కాజల్ (Kajal Agarwal), తల్లి తన బిడ్డ సంరక్షణ గురించి ఎంతలా తపిస్తుందో తెలుసుకున్నాననీ, ఈ క్రమంలోనే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ న్యూ విమెన్ అనే కాన్సెప్ట్‌తో వ్యాపారం మొదలెట్టానంటోంది.
ఇప్పుడు ఒప్పుకుంటారా.? కాదేదీ యాపారానికి అనర్హమని.! తమ గ్లామరే తమ పెట్టుబడి. అలియా బ్రాండ్, కాజల్ బ్రాండ్.. ఆ బ్రాండ్ వాల్యూ లక్షల్లో కాదు, కోట్లల్లోనే వుంటుంది మరి.!
Also Read: డబుల్ ట్రబుల్.! కూతురికి ‘డేటింగ్’పై తల్లి ఉచిత సలహా.!
బ్రాండెడ్ దుస్తుల్ని లక్షలు పోసి కొనడం ఓ యెత్తు.. తమ బ్రాండ్ వాల్యూతో వేరే సంస్థలు లాభపడటమేంటి.? దాన్ని తమకోసమే వాడుకుంటే.. తమ ప్రోడక్ట్స్‌ని ఇతరులు కనీసం వేలల్లో అయినా వెచ్చించి కొంటారు కదా.? అన్న బిజినెస్ ఐడియాని ఎలా తప్పుు పట్టగలం.?
చక్కనమ్ములు.. బిజినెస్ ఐడియాలతో చక్క చక్కగా వ్యాపార రంగంలో రాణించడం విశేషమే మరి.