People Politicians Democracy.. బలిసి కొట్టుకుంటున్నారు.!?

 People Politicians Democracy.. బలిసి కొట్టుకుంటున్నారు.!?

People Democracy Politics

People Politicians Democracy.. రాజకీయాలన్నాక విమర్శలుంటాయ్. కానీ, రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ఆపెయ్యడంలేదు. జనాల మీద పడుతున్నారు.!

తమను రాజకీయ నాయకుల్ని చేసింది ప్రజలేనని మర్చిపోతున్నారు.. ప్రజలకు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు సోకాల్డ్ నాయకులు.

ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చేసి, అధికార పీఠమెక్కడం రాజకీయ నాయకులకు, పార్టీలకూ కొత్తేమీ కాదు.

గద్దెనెక్కుతారు.. ప్లేటు ఫిరాయిస్తారు.!

‘అప్పుడలా అన్నారు కదా, ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించారు.?’ అని ఎవరన్నా ప్రశ్నిస్తే, కులాల ప్రస్తావన తీసుకొచ్చిమరీ జుగుప్సాకరమైన విమర్శలు చేస్తున్నారు ఖద్దరు కేటుగాళ్ళు.

అసలు, ఖద్దరు కేటుగాళ్ళకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది.? వస్తుంది, ఎందుకు రాదు.? ఎందుకంటే, కరెన్సీ నోట్లు వెదజల్లి ఓట్లను కొనుక్కుంటున్నారు కదా.? అద్గదీ అసలు సంగతి.

నోట్లతో ఓట్లను కొంటే మాత్రం, జనాన్ని తిట్టే హక్కు ఏ రాజకీయ నాయకుడికీ లేదు. ఎందుకంటే, ప్రజలు పన్నులు కడితేనే.. సోకాల్డ్ ‘పదవుల్లో’ వున్నవారికి పూట గడుస్తుంది.

People Politicians Democracy.. బలిసి కొట్టుకునే రాజకీయం.!

రాజకీయ నాయకుల దగ్గర నోటు తీసుకుని, ఓటేసినంతమాత్రాన ఓటరుని బానిసగా భావిస్తే, ఆ ప్రజలే జీతమిచ్చి మరీ పదవుల్లో కూర్చోబెడుతున్నారు కదా.. ఆ ఓటర్లకు రాజకీయ నాయకులు ఎంత బానిసత్వం చేయాలి.?

మామూలుగా అయితే, ‘వొళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు..’ అన్న మాట ప్రజల మీద వేసిన ఏ రాజకీయ నాయకుడు అయినా, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో వుండటానికి వీల్లేదు.

మంత్రిగానో, ఇంకో పదవిలోనో వుండాలంటే, కేవలం ప్రజలకు సేవకుడిగా మాత్రమే పని చేయాలి తప్ప, యజమాని లాంటి ప్రజల మీద మాట తూలడానికి అస్సలు కుదరదు.

సమస్య.. సమాధానం.. రెండూ ప్రజలే.!

సమస్య ఎక్కడొస్తోందంటే, ప్రజలు తమ హక్కుల్ని మర్చిపోతున్నారు. పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని అధికారంలో వున్నోళ్ళు బెదిరింపులకు దిగుతోంటే, ప్రజలు భయపడటం మామూలే.

Also Read: తెలుగు సినిమాని ‘పాడె’ మీదకు ఎక్కిస్తున్నదెవరు.?

కానీ, ఆ పోలీసులకు వేతనాలు ఇచ్చేది కూడా ప్రజలు కట్టే పన్నుల నుంచే.! ఆ పోలీసు వ్యవస్థ పని చేయాల్సింది అధికారంలో వున్నోళ్ళ తరఫున కాదు, ప్రజల తరఫున.

కానీ, ఏది పద్ధతిగా నడుస్తోంది గనుక.? అందుకే, ఖద్దరు కేటుగాళ్ళు వ్యవస్థల్ని శాసిస్తూ, ప్రజల్ని తూలనాడే స్థాయికి దిగజారిపోయారు.

Digiqole Ad

Related post