Table of Contents
Bigg Boss Telugu Season 9.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ కొత్త సీజన్ షురూ అవుతోంది. ఎప్పటినుంచి ప్రారంభమవుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
అయితే, ప్రతిసారీ చెప్పినట్లే, ‘ఈసారి బిగ్ బాస్ మామూలుగా వుండదు’ అంటూ పరమ రొటీన్ డైలాగ్, హోస్ట్ అక్కినేని నాగార్జున నుంచి వచ్చింది.
అదేంటీ, ఈసారి హోస్ట్‌ని మార్చుతున్నారనే ప్రచారం జరిగింది కదా.? ప్రచారం మాత్రమే జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో నిర్వాహకులకు వేరే ఆప్షన్ లేదు మరి.
Bigg Boss Telugu Season 9.. కంటెస్టెంట్లు ఎవరో.!
గత సీజన్‌లో కొత్త కంటెస్టెంట్లు.. వారికి తోడుగా అంతకు ముందు సీజన్లలో కంటెస్టెంట్లుగా వున్నవారు.. వెరసి, పాత – కొత్త కలయిక అన్నమాట.
అబ్బే, అయినాగానీ ఆ సీజన్ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఏడో సీజన్ డల్లుగా నడిచినట్లే, ఎనిమిదో సీజన్ కూడా. మరి, తొమ్మిదో సీజన్ పరిస్థితేంటో.? అదైతే, ప్రస్తుతానికి సస్పెన్స్.
ఫలానా సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వస్తున్నారంటూ, సోషల్ మీడియాలో బోల్డన్ని గాలి వార్తలు కనిపిస్తున్నాయి. అఫ్‌కోర్స్, అలాంటి గాలి వార్తలూ నిజమవుతున్నాయ్ లెండి.
టాస్కులు ఏమైనా మార్చుతారా.?
సేమ్ ఓల్డ్ ప్యాటర్న్ ప్రతిసారీ.! అవే టాస్క్‌లు.. అదే రచ్చ, అంతకు మించిన సోది.. గత కొన్ని సీజన్లుగా ఇదే జరుగుతోంది. తొమ్మిదో సీజన్ కూడా అంతేనేమో.!
సీజన్ సీజన్‌కీ రేటింగులు పడిపోతున్నా, అద్భుతం.. మహాద్భుతం.. అంటూ సెల్ఫ్ డబ్బా మాత్రం అస్సలు ఆగడంలేదు.
డ్రమెటిక్ ఏడుపులు.. అర్థం పర్థం లేని లవ్ ట్రాక్‌లు.. వాట్ నాట్, ప్రతిసారీ ఈ ‘డ్రామా’ చూడలేకపోతున్నాం.. అన్నది బిగ్ బాస్ వ్యూయర్స్ నుంచి వస్తున్న బిగ్ కంప్లయింట్.
తిట్టి పోస్తున్నారు నాగ్..
అయినా సరే, నిర్వాహకులు మారడంలేదు.. హోస్ట్ అక్కినేని నాగార్జున అస్సలే మారడంలేదు. పాపం, నాగ్ కూడా దారుణంగా ట్రోల్ అవుతున్నాడాయె.
ఇప్పటికన్నా మారకపోతే ఎలా.? బిగ్ బాస్ వ్యూయర్స్ అభిప్రాయాల్ని తెలుసుకోవాలి కదా.? అంత సోయ, బిగ్ బాస్ తెలుగు రిాయాల్టీ షో నిర్వాహకులకు వుంటే, ఇకనేం.?
Also Read: తెలివైన భర్త మాత్రమే.. భార్య నుంచి తప్పించుకోగలడు.!
చదరంగం కాదు, రణ రంగం.. అంటున్నాడు నాగ్. ప్రతిసారీ అదే కదా జరుగుతున్నది. బోల్డన్ని కాంట్రవర్సీలు.. అన్నీ, హంబక్.!
ఊరికే, కంటెస్టెంట్ల మీద హోస్ట్ నాగ్ విరుచుకుపడటం, పక్షపాత ధోరణి.. ఇవన్నీ మామూలే. ఈసారి కూడా ఇంతకు మించి కొత్తగా ఇంకేమీ వుండకపోవచ్చు.