Allari Naresh Naa Saami Ranga.. కింగ్ అక్కినేని నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? టాలీవుడ్‌కి సంబంధించిన నలుగురు అగ్రహీరోలు (సీనియర్లలో) నాగార్జున కూడా ఒకరు.!
ఆ అక్కినేని నాగార్జున నుంచి ‘నా సామి రంగ’ పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
తాజాగా, ‘నా సామి రంగ’ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ విడుదల చేసింది, ఈ సినిమాలోని అల్లరి నరేష్ పాత్రని రివీల్ చేస్తూ.!
Allari Naresh Naa Saami Ranga.. అప్పుడు మహేష్.. ఇప్పుడు నాగార్జున..
గతంలో మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
మహేష్ అంటే, టాలీవుడ్ సూపర్ స్టార్.! కానీ, ఆ మహేష్‌నే డామినేట్ చేసేశాడు అల్లరి నరేష్ కొన్ని సీన్స్‌లో.!
ఇప్పుడు అక్కినేని నాగార్జుననీ (Akkineni Nagarjuna) డామినేట్ చేసేస్తున్నాడు అల్లరి నరేష్ ‘నా సామి రంగ’ సినిమాలో.
అల్లరి నరేష్ మంచి నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అతని నటన, అతని స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్.!
సరైన పాత్రలు పడితే, తెలుగు తెరపై తిరుగులేని నటుడినిపించుకునే సత్తా వుంది అల్లరి నరేష్‌కి.!
పడుతున్నాయ్.. కానీ, అలాంటి పాత్రలు చాలా చాలా తక్కువగానే ఈ అల్లరోడికి పడుతున్నాయ్.!