Allu Aravind Dil Raju.. ఒక హీరో.. ఒక దర్శకుడు.. ఇద్దరు నిర్మాతలు.! టాలీవుడ్‌లో చిన్నపాటి తుపాను రేగింది.
చివరికి అది టీ కప్పులో తుపానులా చల్లారిపోయింది. లేదంటే, తెలుగు సినీ పరిశ్రమలో చాలా పెద్ద రగడ చోటు చేసుకునేదే.!
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ మధ్య ‘కోల్డ్ వార్’ జరిగింది. కారణం, దర్శకుడు పరశురామ్. మరి, ఈ గొడవలో విజయ్ దేవరకొండకి సంబంధమేంటి.?
విజయ్ దేవరకొండ ఎందుకు తొందరపడ్డాడు.? పరశురామ్ ఎందుకు ‘బకరా’ అయ్యాడు.? అల్లు అరవింద్ ఆగ్రహానికి అసలు కారణమేంటి.? దిల్ రాజు కన్నింగ్ ఆలోచనల వెనుక వ్యూహమేంటి.? ఎన్నెన్నో ప్రశ్నలున్నాయ్..
Mudra369
అదే అసలు కోణం ఇక్కడ. విజయ్ దేవరకొండతో ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఆ సినిమాకి పరశురామ్ దర్శకుడు.
Allu Aravind Dil Raju.. పరశురామ్.. ఎందుకిలా చేశావ్.?
‘సర్కారు వారి పాట’ సినిమాని తెరకెక్కించిన పరశురామ్ అంతకు ముందు ‘గీత గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఆ పరశురామ్ దర్శకత్వంలోనే ‘గీతగోవిందం-2’ తెరకెక్కాల్సి వుంది. ఈ సినిమాపై ప్రకటనకు అంతా సిద్ధమవుతుండగా, దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ సినిమా.. అనే ప్రకటన వచ్చింది.
ఇక్కడ, ‘బకరా’ అయ్యింది పరశురామ్.! హీరో విజయ్ దేవరకొండకి పెద్దగా ఈ వివాదంతో లింక్ ఏమీ వుండకపోవచ్చు.
దిల్ రాజు, అల్లు అరవింద్ కూడా ఎలాగోలా కలిసిపోవచ్చు.. తమ మధ్య పొరపచ్చాల్లేవని ప్రకటించేసుకోవచ్చు. కానీ, పరశురామ్ పరిస్థితి అది కాదు.
Also Read: డబుల్ ధమాకా.! ఎన్టీయార్ ఫ్యాన్స్‌కి పండగే పండగ.!
మీడియా ముందుకొచ్చి అటు దిల్ రాజునీ, ఇటు పరశురామ్‌నీ ఏకి పారెయ్యాల్సిన అల్లు అరవింద్ అనూహ్యంగా సంయమనం పాటించారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అల్లు అరవింద్ వైపు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.. ఆయన సంయమనం కారణంగానే.! దిల్ రాజు కన్నింగ్ నేచర్ ఇంకోసారి బయటపడిందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.