Allu Arjun Awards Lobbying.. కొనుక్కుంటే అవార్డులొస్తాయ్.! లాబీయింగ్ చేసుకుంటే అవార్డులొస్తాయ్.! గత కొంతకాలంగా దేశంలో ఏ పురస్కారాల విషయంలో అయినా, ఈ ఆరోపణ తప్పడంలేదు.
సినీ అవార్డుల విషయంలో, లాబీయింగ్ కీలక భూమిక పోషిస్తుంటుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డులైతే, ఆయా ఈవెంట్లకు ఆయా సెలబ్రిటీలు హాజరవుతారా.? లేదా.? అన్నదానిబట్టి నిర్ణయిస్తుంటారు.
దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల విషయంలో కూడా ఈ లాబీయింగ్ ఆరోపణలు వినిపించాయి.. వినిపిస్తూనే వున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
జాతీయ సినీ అవార్డులు..
‘పుష్ప’ సినిమాకి సంబంధించి అందులో హీరోగా నటించిన అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం ప్రకటించడం చాలామందికి మింగుడుపడ్డంలేదు.
ప్రధానంగా తమిళ సినీ పరిశ్రమ గుస్సా అవుతోంది.! అంతే కాదు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన ఎన్టీయార్, రామ్ చరణ్‌లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

తెలుగు సినీ పరిశ్రమలో ఇంతవరకూ ఏ నటుడూ దక్కించుకోని అరుదైన గౌరవాన్ని జాతీయ ఉత్తమ నటుడిగా తొలిసారి దక్కించుకున్నాడు అల్లు అర్జున్.
ఈ విషయంలో, తెలుగు సినీ పరిశ్రమ మొత్తంగా ఆయనకు బాసటగా నిలుస్తున్నమాట వాస్తవం. స్వయంగా ఎన్టీయార్, రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్‌ని ఈ సందర్భంగా అభినందించారు.
Allu Arjun Awards Lobbying.. తెలుగు సినీ నటులకి అన్యాయం..
తెలుగు సినీ నటులకు చాలా సందర్భాల్లో అన్యాయం జరిగింది జాతీయ అవార్డుల విషయంలో. ‘రంగస్థలం’ సినిమాకిగాను రామ్‌చరణ్‌కి నటుడిగా జాతీయ అవార్డు దక్కి వుండాల్సింది.
Also Read: కర్ర పెత్తనం.! ‘పులి’ రాజా.. పారిపో.!
అదే జరిగి వుంటే, అల్లు అర్జున్‌కి దక్కింది రెండో పురస్కారం అయి వుండేది. తెలుగులో టాలెంట్ లేక కాదు.. తెలుగు సినీ పరిశ్రమ అంటే, నేషనల్ అవార్డుల జ్యూరీకి ఒకింత చిన్నచూపు.
ఏదిఏమైనా, అల్లు అర్జున్ అవార్డుని కొనుక్కున్నాడనో.. లాబీయింగ్ చేశాడనో.. అనడం అస్సలు సబబు కాదు.! ఈ తరహా దుష్ప్రచారం ఎవరు ఎందుకు పనిగట్టుకుని చేస్తున్నారో తేలాల్సి వుంది.