Table of Contents
Allu Arjun Thanks Pawan Kalyan.. కృతజ్ఞత చెబితే, క్షమాపణ అడిగినట్లుందేంటి.? ఇప్పుడిదే హాట్ టాపిక్.! సందర్భం, పరిస్థితులు అలా వున్నాయ్ మరి.!
సినీ నటుడు అల్లు అర్జున్, ‘కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్స్’ అని చెబితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి పుష్పరాజ్ క్షమాపణ.. అన్నట్లుగా అనిపించింది చాలామందికి.!
అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు చేసిన ‘అతి’ అంతా ఇంతా కాదు.!
Allu Arjun Thanks Pawan Kalyan.. మెగా కాదు, అల్లు.!
నేను మెగా కాదు. అల్లు.. అన్నట్లుగా అల్లు అర్జున్ ఈ మధ్య చాలా సంకేతాలు ఇచ్చాడు. తనకంటూ ఓ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నాడు.. ఆర్మీ అంటే, ‘అతి’ బ్యాచ్ ఇక్కడ.!

సరే, సినీ నటుడిగా తనకంటూ ఓ సెపరేట్ స్టార్‌డమ్ వుండాలని అల్లు అర్జున్ కోరుకుంటే, అందులో తప్పేమీ లేదు.
కానీ, ‘అభిమానుల్ని చూసి హీరో అవ్వాలనుకున్నా..’ అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం, తన ఆర్మీతో, మెగా హీరోల మీద నానా రకాల దూషణలూ చేయించడం.. ఇవేవీ సమర్థనీయం కాదు.
ఈ థ్యాంక్స్ వెనుక అసలు కోణమేంటి.?
ఏమయ్యిందోగానీ, ‘పుష్ప 2 ది రూల్’ సినిమా సక్సెస్ మీట్‌లో, ‘ఆన్ పర్సనల్ నోట్.. కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్స్..’ అంటూ అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.

దాంతో, తొలుత అల్లు అర్జున్ ఆర్మీ అవాక్కయ్యింది. ఆ ఆర్మీ ముసుగులో చెలరేగిపోయిన వైసీపీ కార్యకర్తలూ షాక్‌కి గురయ్యారు. మెగాభిమానులు మాత్రం, ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
వాస్తవానికి, ‘పుష్ప 2 ది రూల్’ సినిమాని మెగాభిమానులెవరూ పట్టించుకోలేదు. ‘పుష్ప ది రైజ్’ సినిమా వరకూ అల్లు అర్జున్‌ని భుజాన మోసింది మెగాభిమానులే.
అల్లు అర్జున్ అతి..
ఎప్పుడైతే అల్లు అర్జున్, ‘నా ఆర్మీ’ అంటూ ‘అతి’ చేయడం మొదలు పెట్టాడో, ఇక అప్పటినుంచీ అల్లు అర్జున్‌ని ‘మావాడు కాదు’ అని మెగాభిమానులు డిసైడ్ అయిపోయారు.
‘నేనే తోపు..’ అని ఫీలయిన అల్లు అర్జున్, ‘కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్స్ చెప్పిన దరిమిలా, దీన్ని ‘థ్యాంక్స్’లా కాకుండా, ‘క్షమాపణ’లా భావిస్తున్నారు మెగాభిమానులు.
Also Read: ఇస్మార్ట్ రామ్ ఎనర్జీని ‘బచ్చన్’ బ్యూటీ మ్యాచ్ చేయగలదా.?
ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీకి వ్యతిరేకంగానే అల్లు అర్జున్ పావులు కదిపాడు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు పలికాడు. అలా జనసేన శ్రేణులు, అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా మారారు.
మెగాభిమానులే, జనసేన శ్రేణులు.. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!